పుట:Andhraveerulupar025903mbp.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయమున కావలి దుర్గమ రాజ్యభాగములుగూడ సాధించెను. మలయ కేతువు చంద్రగుప్తునకు సామంతుడై యుండెను. పర్వతరాజు ఫిలిప్పాస్ అను గ్రీకురాజనియు శల్యూకసు మలయకేతు వనియు నిప్పటి చరిత్రవిదు లూహించుచున్నారు.

చాణక్యుడు ఉత్తమచరిత్రుడు. క్షాత్రమున నీతడు పరశురామునకు, స్వామిభక్తియందు సుగ్రీవునకు, గార్యదక్షత యందు నాంజనేయునకు సమానుడు. చాణక్యుని గుణప్రశంస పురాణాదులయందును కామందకాది రాజనీతి గ్రంథములందును గలదు. రాజనీతిశాస్త్రము లన్నిటియందును దొలుదొలు చాణక్యునిప్రశంస గనబడుచున్నది. చాణక్యుడు వ్రాసిన నీతి శాస్త్రము నీతిగ్రంథములన్నిటిలో మిగుల బ్రశస్తిగాంచియున్నది. చాణక్యుడు "ఇదంక్షాత్ర మిదం బ్రాహ్మ్య"మను ధర్మ సూక్తికి దార్కాణముగ బ్రాహ్మణధర్మములగు పారమార్థిత విజ్ఞానములయందును క్షాత్రధర్మములగు చతురుపాయముల యందును సమర్థుడై మౌర్యరాజ్యమును భరతఖండమున జిరకాలము నిలుచునటుల జేసి సామ్రాజ్య సంరక్షణమునకు బరపక్షకోటిలోనివాడగు రాక్షసుని నియోగించి తాను తపోవనంబున కగెను.

చాణక్యుడు చందనదాసుని స్వామిభక్తికి సంతసించి యాతని విడుచుటయు రాజనీతివిదుడగు రాక్షసుని మంత్రిగ నేర్పాటు చేయుటయు బర్వతరాజును భాగము గోరకుండు