పుట:Andhraveerulupar025903mbp.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాయములతో దామార్జించిన రాక్షసుని ముద్రికను జాణక్యున కొసంగిరి. చాణక్యు డాముద్రికా సహాయమున గొన్ని పత్రికలను సృష్టించి జీవసిద్ధి చేతికిచ్చి ప్రచారము లోనికి దెప్పించి, రాక్షసునకు మలయ కేతువునకు విరోధము కలుగు నటుల జేసెను. అందుచే మలయ కేతువు నిశ్చయించిన దాదియు విఫలమయ్యెను. రాక్షసునకు మలయకేతువు నొద్ద ప్రాపకము తగ్గెను. తనతండ్రిని రాక్షసుడే చంపెనని మలయ కేతువు ద్వేషముగూడ వహించెను. 'మృతినొందిన నందాదుల యాత్మ శాంతికొఱకు జాణక్యుని గాని చంద్రగుప్తుని గాని సాధింపలేక పోతినిగదా, నేను జీవించి ఫలమేమని రాక్షసుడు పరితపించు చుండెను. రాక్షసుని నెటులేని చంద్రగుప్తునకు మంత్రినిగా జేసిన బాగుండునని సర్వవిధముల జాణక్యుడు ప్రయత్నించెను గాని నందపక్షపాతియగు రాక్షసుడందుల కంగీకరింపక పోయెను.

రాక్షసుని లోబఱచికొన నేవెరపుగానక చాణక్యుడు కడకొక యుపాయమును బన్నెను. రాక్షసుని భార్య సుతులు చందనదాసుని యింట బాటలీపుత్రమున నుండిరి. చందనదాసుడు రాక్షసునియెడ భక్తివిశ్వాసములు గలవాడు. చాణక్యుడు చందనదాసుని రప్పించి రాక్షసుని భార్యా శిశువుల దన యధీనము గావింపుమని నిర్భంధించెను. స్వామి భక్తిపరాయణుడగు చందనదాసు డందుల కంగీకరింపక తిరుగబడుటచే జాణక్యుడాతని కురిశిక్ష విధించెను; ఈసంగతి