పుట:Andhra bhasha charitramu part 1.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఉత్తర హిందూస్థాన భాషలలో ఓడ్రభాషావికారములగు గచికోలో, కంగాలి, ఉత్కలీ భాషలును, తూర్పు హిందీభాషావికారమగు "కలంగ" భాషయును పశ్చిమ హిందీభాషావికారములగు పింగళ్, డాండా భాంగ్, డాంగీ, భాషలును, బంగాళము, ఒరిస్సా, బేహరము, ఛోటానాగపూరు దేశములలో సంచారశీలురగు నొకజాతివారు మాట్లాడు "గుల్ గులియా" భాషయను, బంగాళాదేశములోని బంగ, హైజోంగ్, ఆబెంగ్, అరంగా, భాషలును, మాఱ్వాడీ భాషావికారములగు డటకీ, డింగళ్, అనుభాషలును, నిట్టి ప్రత్యయములనే కలిగియున్నవి. కాంగ్రాయనునది పంజాబీ భాషావికారము. అవాంకారీ, అవాంకీ, అనుభాష పశ్చిమోత్తర పరగణాలలోని కోహత్ జిల్లాలోనిది. ఇది లహందా భాషావికారము. గంగోలాయనుభాష హిమత్పర్వత పాదమునందలి పహాడిభాషకు మాండలిక రూపమైన కుమౌనీ భాష యంతర్భాగము, డుంగరీ, డంకీ, యనునవి బెలూచిస్థానములో బ్రచారమున నున్నవి. పశ్చిమోత్తర పరగణాలలోని హింద్కో భాషయందు గూడ నీ ప్రత్యయము కనబడుచున్నది. వైగలీయను పిశాచభాష కాశ్మీర ప్రాంతమునందలిది. జ్ఞాంగ్, డంగార్, దిక్కూకాజీ, ఔరంగ్, ఉరంగ్ అనునవి ముండా భాషావిశేషములు.

బర్మాలో తలైంగ్ అనునొక భాషయున్నది. ఇది ఆష్ట్రో-ఏషియాటికు భాషా కుటుంబమునకు జేరిన మోన్-ఖ్మేర్ శాఖకు సంబంధించినది. దీనిని మాట్లాడువారి సంఖ్య 224424. ఇది బర్మాలోని అమ్హర్‌స్టు, థాటోను జిల్లాలో బ్రచారమున నున్నది. తలైంగ్-కలసీ యనునొక భాష బర్మాలోని యామేథిను జిల్లాలో వాడుక యందున్నట్లు తెలియవచ్చుచున్నది. తలైంగ్ కయిన్, అను మఱియొకభాష బర్మాలోని చాలజిల్లాలలో వాడుక యందున్నట్లును దానిని 352466 మంది మాట్లాడుచున్నట్లును బర్మాదేశపు జనాబా లెక్కల వలన దెలియుచున్నది. బర్మాలోని యుత్తర భాగమున తైలోంగ్ అనునొక భాషను 18074 మంది మాట్లాడుచున్నారట. అస్సాముదేశములో తురూంగ్ అను మఱియొకపేరుగల తైరోంగ్ భాషయున్నది. నేపాళదేశములో థూలుంగ్ అనునొకభాష మాట్లాడ బడుచున్నది. బర్మాలోని తెలైంగ్ దేశమునకును తెలుగుదేశమునకును చిరకాలమునుండి వాణిజ్యాది సంబంధముండినట్లు బర్మాదేశపు చరిత్రమువలన దెలియనగును. కాని తెలుగు భాషకును తెలైంగ్ భాషకును నేడెట్టి సంబంధమును సన్నిహితమైన దానిని కనిపెట్టుటకు వీలులేకున్నది. నేడు ప్రిజులిస్కీ మొదలగు పండితులు ఆష్ట్రిక్ భాషలకును ద్రావిడభాషలకును సంబంధమున్నట్లు తెలియ జేయుచు దద్విషయమై పరిశోధనముల గావించుచున్నారు. పరిశోధనముల మూలమున