పుట:Andhra bhasha charitramu part 1.pdf/853

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వునుబట్టి దానియొద్దనున్న యూరికి 'రాయలచెఱువు' అను పేరు రూఢియైనది. ఆ యూరినిబట్టి యా చెఱువును 'రాయల చెఱువు చెఱువు' అను పేరు వచ్చినది. శ్రీశైలపర్వతము (శ్రీశైలము అను పర్వతము అని యర్థము) - సింహాచలం కొండయు నిట్టిదే.

(3) నిర్ధారనార్థము: బోర్డుబల్ల (ఇందు 'బోర్డు' ఇంగ్లీషుపదము; బల్ల తెనుగుపదము. అనేకవిధములగు బల్లలలో 'బోర్డు' అనుబల్ల ప్రత్యేకముగ నిర్దేశింపబడినది. - గేటువాకిలి ('గేటు' ఇంగ్లీషుపదము; వాకిలి తెనుగు పదము. వాకిలియనగా తలుపని రాయలసీమయందు వ్యవహారము. చూ. కన్నడము: బాగిలు = తలుపు. వాకిలి పదమునకు తలుపు అను నర్థమున గ్రంథములందును బ్రయోగములు గలవు. వాకిళ్లు (తలుపులు) అనేక విధములైన వుండగా నందు 'గేటు'ంస్కుండు తలుపు అని చెప్పుట కీ సమాసము నుపయోగింతురు.) - 'స్లేటు పలక' ('స్లేటు' ఇంగ్లీషుపదము; పలక తెనుగు. పలక లనేకవిధములైన వుండగా నందు వ్రాతకుపయోగించు ఇంగ్లీషు 'స్లేటు' అను పలక యనునర్థమున నీ సమాసము వాడబడుచున్నది. - ఇట్లే 'పెన్సలుపుల్ల, ట్రంకుపెట్టె' మొదలగు వానిని దెలిసికొనవలెను.

(4) అగ్గినిప్పు, నడుమంతరము, వెధవముండ - ఇట్టి సమాసములలో రెండుపదములకు నించుమించుగా నర్థమొక్కటే యైనను, పై యుదాహరణములందువలె వానిని గలుపుటవలన నర్థవిశేషము కలుగలేదు.

(5) అటమట, అదవద, అఱ (-ర) మర, అలబలము, అల్లిబిల్లి, ఉదురుమిడుకు, ఒడుదొడుకు, కట్టుపకాసి (-సు),గాసటబీసట, తటమట, తబ్బిబ్బు, దందడి, బటాబూరము, ముంగ (-౦గా, - గయి, - గై) మురము (-రారి); వేళాకోళం - ఈ సమాసములలోని రెండుపదములకును నేడు వ్యస్తముగ వ్యవహారములేదు; ఎప్పుడయిన నుండెనేమో తెలియదు. 'అఱమర' లోని 'అఱ' కు మాత్రము పూర్వగ్రంథములందువ్యస్తముగ బ్రయోగము గలదు.

(6) అఱ్ఱాక, అఱ్ఱాకలి - వీనిలో 'అఱ్ఱు' నకు 'ఆక', 'అకలి' యను నర్థము లితరద్రావిడభాషలయందు. అత్యంతార్థమున నివి యీ సమాసములలో దొలిపదములుగ జేరినవి.

(7) నిర్ధారణార్థము: (అ) (3) - లో నింగ్లీషు పదములతో తెనుగు పదములు చేరిన సమాసములు చూపబడినవి. ఇతరభాషాపదములు జేరిన సమాసముల కుదాహరణములు: ఆలిచిప్ప (హిందూస్థానీ: ఆలి = చిప్ప); ఆలెప్రొయ్యి (కన్నడము: అలె = ప్రొయ్యి);కందదుంప (సం. కందు = దుం