పుట:Andhra bhasha charitramu part 1.pdf/854

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప; 'కందమూల' మని సంస్కృతమందే సమాసముగలదు. గంజాంజిల్లాలో 'కందమూలందుంప' అని దుంపగలదు. 'కందదుంప' కు 'కంద' అనియు వ్యవహారము గలదు. 'కందమూలము' నకే 'కందమూలదుంప' యని గంజాంలో వ్యవహారము) - కప్పతాళము ('కప్ప' యన్నను 'తాళ' మన్నను నొక్కటే 'కప్ప' యాకారముననుండుటచే గావలయు 'కప్ప' యనుపేరు వచ్చినది. 'తాళము' ఏభాషలోనిదోతెలియదు. తాళమునకు 'కప్ప' యనునర్థమేకాక దానిని తెఱచునట్టి చెవి యనునర్థమును గలదు. 'కప్పతాళము' లో తాళమునకు 'కప్ప' యనియే యర్థము.) - తాళంచెవి (హిందూస్థానీ: చాబీ = తాళంచెవి; తాళమన్నను, చెవియన్నను నొక్కటే యర్థము.) - కొల్లా (రు) బండి ('కొల్లారు' హిందూస్థానీ పదము. దాని యాకారముగల బండియని యర్థము.) గాజాపరుజ ('గాజా' 'పరుజ' అను రెండుపదములును నన్యదేశ్యములే. రెండును 'కాత్తిపిడి' యను నేకార్థముగలవి).

(ఆ0 కొఱవిచీమ, దుడ్డుకఱ్ఱ, గడ్డిపోచ - వీనిలోని రెండుపదములకును నర్థమొక్కటే. రెండును తెనుగుపదములే. సమాసమున నిర్ధారణమును దెలుపుచున్నవి. ఒకవిధమైన పెద్దచీమ, లావైన (దప్పమైన) కఱ్ఱ, గడ్డికి సంబంధించినపోచ అను నర్థములం దివి వాడబడుచున్నవి.

(8) కఱకఱ = బాధ; కొఱకొఱ = కోపము - మొదలగు ద్విరుక్త పదములు ధ్యన్యనుకరణములై భావార్థబోధకము లగుచుండును.

(ఆ) కింకిరి = కోపము (కిం = కిను, చూ. కినుక) కింగిరి = అల్పము (చూ. కన్న. కిఱు = చిన్న) - ఇట్టి ద్విరుక్త పదములం దేదో యొకదానికి వికారము కలుగును. (ఇ) కయ్యాలక్రచ్చ మొదలగు వానిలో రెండుపదములకును నర్థమొక్కటే; మొదటిది బహువచన మందుండును. కయ్యమన్నను క్రచ్చ యన్నను నర్థ మొక్కటే.

(9) అడగిమడగిఉండు, ఉఱ్ఱట్లూగు, ఉఱ్ఱూతలూగు, ఊలమాల గుడుచు, అల్లాడు, అల్లల్లాడు, అల్లార్చు, ఒడ (న) గూడు, కదలాడు, నిఱ్ఱనీలుగు, బిఱ్ఱబిగియు, మాటుమణగు, ముచ్చముడుగు, పాఱజూచు - మొదలగు ధాతువులలో ద్విరుక్తికలదు. ఇందలి మొదటి పదము రెండవదానికి రూపాంతరమో, సమానార్థకమో, యయి యుండును. 'కదలాడు' అను దానిలో 'కదలు, ఆడు' వేర్వేఱు ధాతువులు. 'పాఱ జూచు' అనుదానిలో'పాఱ్‌' అనునది తమిళపదము, 'చూచు' అనియర్థము.

'వ్రచ్చి వందఱలాడు' అను ధాతువులో 'వ్రచ్చు' 'వందఱ' లు సమానార్థకములు. ఇచట రెండవపదము బహువచనరూపమున నున్నది.