పుట:Andhra bhasha charitramu part 1.pdf/852

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గునగాక మఱియొక ద్రావిడభాషలో రెండవపదమునకు రూపాంతరముగా నున్నది.

(ఇ) కారుప్పు (దీనిలో 'కారు' క్షారశబ్దభవము; 'ఉప్పు' దేశ్యము); చేదువిషం ('చేదు' దేశ్యము; 'విషము' సంస్కృతము); పుల్ల ఱొడ్డు (పుల్ల, ఱొడ్డు అను పదములు మాండలికములు); ఈ యుదాహరణములలో పదములు వేర్వేఱయినను రెండింటికి నర్థమొక్కటే.

పైనిచూపిన (అ), (ఆ), (ఇ) లలోని యుదాహరణములందు మొదటి పదము మొదటియచ్చుపై నూతయున్నది; అనగా నా యక్షరము నూది పలుకవలెను. ఆ యూత ననుసరించియే యత్యంతార్థము కలుగుచున్నది.

(ఈ) నిట్రుపాసము, నుగ్గునూచము - వీనిలో గూడ 'నిట్రు', 'ఉపాసము' అను పదములకును, నుగ్గు, నూచము, అను పదములకును నర్థ మొక్కటే. వీనిలోని నిట్రు, నూచము, అను పదములకు నేడు భాషయందు వ్యస్తప్రయోగములేదు. వీని కత్యంతార్థమున్నను, నాయర్థ మంతస్పష్టముగలేదు.

(ఉ) తుందుడుకు, దాదాపు - వీనిలో 'తుం', 'దా' అనునవి '*తుందు, దాపు' అను వానిలోని తొలితునుకలు; అవి ప్రత్యేకపదములు కావు.

(ఊ) ఉఱ్ఱూతలు, ఇల్లిగ్గులు, ఇఱ్ఱింకులు - వీనిలోని 'ఉఱ్ఱు, ఇల్లు, ఇఱ్ఱు' అనునవి తెనుగున నష్టపదములు. సజీవములైన 'ఊత, ఇగ్గు, ఇంకు' అను పదములతో గలిసి యత్యంతార్థమును దెలుపుచున్నవి. (ఈ) - లోని సమాసము లేకవచనమున నుండగా నివి నిత్యముగ బహువచనమున నుండును.

(ఋ) తుందునుకలు, తెందెప్పలు - వీనిలోని 'తుం', 'తెం' అనునవి తునుకు, తెప్ప, అను నర్థముగల పూర్ణపదముల తునుకులు. ఆ పదము లిప్పుడు భాషనుండి లోపించినవి. ఇవి(ఉ) - లోని సమస్తపదములవంటివే యైనను నవి యేకవచనమందుండగా నివి బహువచనమం దున్నవి.

(2) పెనుగొండకొండ (పెద్దకొండ యుండుటవలన నదియుండు ఊరికి పెనుగొండయనుపేరు రూఢియైనది. ఆ 'పెనుగొండ' యను నూరగలకొండ 'పెనుగొండకొండ' యైనది.) - సీతాఫలప్పండు, రామాఫలప్పండు, కమలాఫలప్పండు (ఆ ఫలములపేళ్లు 'సీతాఫలము, రామాఫలము, కమలాఫలము, అని. ఆపేరుగలపండ్లు అను నర్థమున పై పేళ్లు గంజాము మండలప్రాంతమున వాడుకయందున్నది.) - రాయల చెఱువు - చెఱువు (రాయలుత్రవ్వించిన చెఱు