పుట:Andhra bhasha charitramu part 1.pdf/816

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కలుగు సమాసములకును రూపఘటనమునందు భేదము కాన్పింపదు. ఇట్టి సమాసముల రూపమునుబట్టి వానిని కొన్ని వర్గములుగా నేర్పఱుపవచ్చును.

i. వ్యస్తపదముల కెట్టిమార్పును గలుగనివి.

కొన్ని సమాసములందు వ్యస్తముగానున్న పదముల కెట్టిమార్పును కలుగక యాపదము లొకదాని తరువాత నొకటిచేరి సమాసము లగును. 'Analytical languages' అనగా నుప్ - తిజ్ ప్రత్యయరహితభాషలని భాషాసాస్త్రజ్ఞులు తెలుపు భాషలయందెల్ల సమాసఘటన మిట్లే యుండును. చీనభాషయు, ఇంగ్లీషుభాషయు నిట్టివాని కుదాహరణములు. ఇంగ్లీషున సమాసములు క్రికెట్ మేచ్ (cricket match); మేచ్ - బాక్స్ (match box), రైల్‌వే - ట్రైన్ (rail-way-train), ఈ రీతిగానుండును. వీనిలోని పూర్వపదముల కెట్టి వికారమును గలుగదు. తెనుగున నాచ్ఛిక సమాసములలో సాధారణముగ నిట్లే యుండును. ఉదాహరణములు:-

రెండును వైకృత పదములు:- అడవికుక్క, ఒజ్జబంతి, కుమ్మరపురుగు, గడసాదన, తీగమలై, పట్టెమంచము మొదలయినవి.

ఒకటి వైకృతము నొకటి దేశ్యమునయిన పదములసమాసములు:- చలిగరువు, చనుమొన, చంకతాళి, చేఱుబొందు, చెలదితెర, చిచ్చుబుడ్డి, గోరుచుట్టు, గోనెసంచి, గుండుఱాయి, గుంటప్రొయ్యి, గాలిపటము, గానుగపిండి, గుంటవేట, క్రందుకయ్యము, కోలదివియ, కొండగుఱుతు, కాంచువడియము, కఱ్ఱుగుద్దలి, కత్తెరవాసము, కత్తిమందు, కడుపుమంట, చెవిపోటు, కంచెకోట మొదలయినవి.

రెండు పదములును దేశ్యములయిన సమాసములు:- అంటుపేను, ఆకుపచ్చ, ఆటవిడుపు, ఇలునింపడము, గొడుగుబల్ల, చుట్టుగుల్ల, జాలెత్రాడు, పందిమూతి, పనిముట్టు, పెండ్లినడక, పొగగూడు, పోగుపోత, బొద్దుకీటు, బొమముడి, మూతబల్ల, మెయిమఱపు, వెన్నుపాము మొదలయినవి.

ii. వ్యస్త పదములకు సమాసమందు మార్పుగలుగుట.

(అ) పూర్వపదమునకు.

(1) పూర్వపద మౌపవిభక్తిక మగుచో దాని యౌపవిభక్తికరూపము నిలుచును: ఉదా. మునికోల, మునియేడు, చెలియలికట్ట, చౌకాలిపీట, పొత్తినూలికాయ, నూలిగరను, నోటిబీగము, అంగిటిముల్లు, కుందేటికొమ్ము, నాగటిచిప్ప, నాగటిదుంప, పొంగటిపండుగ, కూటినీళ్లు, కూటిముత్యము, చౌటుప్పు, పాటినేల, పాటిరేవు, పురుటిల్లు, జుంటితేనె, మంటినూనె, వింటి