పుట:Andhra bhasha charitramu part 1.pdf/817

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోల, అడ్డవాతియమ్ము, దాతికఱ్ఱ, పాఱవాతియమ్ము, చేతిబిడ్డ, ఱాతియుప్పు, ఱాతిగుండె, ఱాతియులి, వాతిబియ్యము, దంవకఱ్ఱ.

(2) కొన్నియెడల పూర్వపదము తుది మువర్ణము 'ప' వర్ణమగును: అనుపసూది, నాపఱాయి, పాపజగము, ఇనుపకమ్మి, జనుపనార, దంపకఱ్ఱ మొదలయినవి.

(3) కొన్నియెడల పూర్వపదముతుది 'పు' వర్ణముపై 'అ' కారము చేరును. నిడుపకమ్ములు.

(4) కొన్నియెడల పూర్వపదము తుది మువర్ణమునకు 'పు' వర్ణ మాదేశమగును: ఉదా. అగండ్రపాకు, అడిదపుమెకము, ఉంగరపువ్రేలు, మైనపు జిడ్డి, రాట్నపాకు, మగ్గపుగుంత.

(5) కొన్నియెడల బూర్వపదము తుది మువర్ణమున కాదేశముగా వచ్చిన 'పు' వర్ణముపై నుగాగమముగలిగి సంధియందు ద్రుతమునకు గలుగు కార్యములు కలుగును: ఉదా. కారపుబడుగు, తొండపుద్రాడు, పల్లపుబంట, ముత్తెపుజిప్ప, తోరణపుగమ్మి, చఱపుబిడుక మొదలయినవి.

(6) ఇట్టి 'పు' వర్ణమున కచ్చుపరమైనయెడల గొన్నియెడల టుగాగమము కలుగును: ఉదా. నెయ్యపుటలుక. కొన్నియెడల గలుగదు: ఉదా. రాట్నపాకు, తములపాకు.

(7) కొన్నియెడల బూర్వపదము మువర్ణాంతము గాకున్నను దానిపై 'పు' వర్ణ మాగమము గావచ్చును: ఉదా. తామరపాకు.

(8) కొన్నియెడల బూర్వపదముపై టుగాగమము గలుగును: ఉదా. అచ్చుటెద్దు, ఆకుటిల్లు, ఉంకుటుంగరము, తూగుటుయ్యల, దంపుటిల్లి, పడుకటిల్లు మొదలయినవి.

(9) కొన్నియెడల 'టి' వర్ణ మాగమముగా వచ్చును: బుఱ్ఱటకొమ్ము, పిన్నటనాడు మొదలయినవి.

(10) కొన్నియెడల 'రి' వర్ణ మాగమముగా వచ్చును: ఉదా. పీతిరిగుంట, నంగిరిమాట.

(11) ఉదంతస్త్రీ సమపదములపైన బరుష సరళములు పరమగునపుడు నుగాగమగును: ఉక్కుదీగ, తొఱ్ఱుబట్టు, దుడ్డుగఱ్ఱ, పొత్తుగుడుపు మొదలయినవి.

(12) ఈ కార్యము ఉదంత విశేషణముల మీదను గలుగును: ఉదా. పెనుంగొమ్మ, పెనుగొండ మొదలయినవి.