పుట:Andhra bhasha charitramu part 1.pdf/815

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదములు చేరి యుండుటచే నవి సాధ్యసమాసములు కాకపోవును. కర్మధారయ సమాసములను క్రియాజన్య విశేషణముల సంబంధము లేనిదే తత్సమ పదములనుండి యేర్పఱుచుట యసంభవము: 'మధురమైన ఫలము' అనవలెను. హాని, 'మధురము ఫలము' అను సమాసము తెనుగున సిద్ధింపలేదు. ఇట్లే బహువ్రీహిసమాసములను గూడ దత్సమపదములతో నేర్పఱుప వీలులేదు. 'గ్రామము ప్రాప్తోదకము' అనుదానిని దత్సమసమాసము చేయదలచినచో ద్రావిడప్రాణాయామపద్ధతి నుపయోగించి 'ఎచట నుదకము ప్రాప్తమో అది (గ్రామము)' అని చెప్పికోవలసినదేకాని వేఱు గతిలేదు. ---- వ్యాఖ్యాప్రాయమయిన పదవిన్యాసమును సమాసమని చెప్పుట తగదుగదా. నఞ్ - సమాసమునకు దత్సమసమాసములతో బ్రసక్తియే లేదు.

ఆచ్ఛిక సమాసములు.

ఆచ్ఛిక సమాసములు రెండువిధములు (i) అఖండ వైకృతములు (ii)ఇతరములు. (i) సంస్కృత సిద్ధసమాసము లున్న వున్నట్లుగానే వికృతినొందినవి వైకృతములు. ఇట్టివానిలో బ్రత్యేకపదములు వికృతియందు గోచరింపక పోవచ్చును: ఉదా. శూర్పణఖ = చుప్పనాక, ఇందు 'చుప్ప', 'నాక' అను పదములకు దెనుగున బ్రత్యేకస్థితిలేదు. ఇట్లే ఆంఘ్రిజాత = అంగజాల; అంగారపోలికా = అంగరొల్లె(లు) అంభశ్చరము = అంబాచారము; అపూర్వము = అపురూపము; హరితాళము = అరిగళము; ఏకాంతము = ఎగ్గతము, ఏకతము; అఖండము = ఏకాండము; కాండవటము = గందవడము; చతురశీతి = చౌసీలి; దండనాయకుడు = దణాయడు, మొదలయినవి.

కొన్నియెడల సిద్ధసమాసము సంపూర్ణరూపము వైకృత మయినప్పుడు సమాసమందలి యొకపదమునకు దెనుగున వ్యస్తప్రయోగ ముండక పోవచ్చును: చెంద్రవంకలు; ౘందురవంకలు (-కూనలు), దుబ్బనదూఱ, దిక్క(-క్కా-చ్చు) మొగము, నెట్టినసీల, అంతిపురి (-రము), అడియాస, అద్దమరేయి, అమవడ, పడిహారి, పరుసపాది; చౌసాల; గండగొడ్డలి, గండకత్తెర, - ఇట్టి వానిలోని మొదటిపదములుగా గాన్పించు 'చెంద్ర' చందుర, చుబ్బన, దిక్క(-క్కా -చ్చు), నెట్టిక, అంతి, అడి, అద్దమ, ఆమ, పడి, పరస, గండ, చౌ, మొదలగువానికి దెనుగున వ్యస్తప్రయోగములేదు. మూలమున సమాసమున నుత్తరపదములుగా నుండిన పదములు వికృతియందు కేవల ప్రత్యయములుగా మాఱి తెనుగున వ్యస్తపదములయినవి. అట్లేకపదముగా నిప్పుడు గాన్పించు పదములు తొలుత సమాసములే.

(ii) పై రీతివిగాక ప్రత్యేకముగా వికృతులై ప్రత్యేకార్థములు గలిగిన పదముల సమాసములకును, వైకృతదేశ్య, దేశ్యదేశ్య పదములు చేరి