పుట:Andhra bhasha charitramu part 1.pdf/814

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యందము, అను వానియందుగూడ సమాసరచనయందుగాని, రూపమునందుగాని యెట్టి భేదమును గాన్పింపదు.

ఇదిగాక తత్సమపదములతో గేవలము చతుర్థీ షష్ఠీ తత్పురుషసమాసములను మాత్రము కల్పింప వీలగునేమోకాని, తక్కిన సంస్కృత సమాసములను గల్పింప వీలులేనట్లు తోచుచున్నది. అవ్యయములను బ్రత్యేకముగా దత్సమములుగ నుపయోగింప వీలులేకపోవుటచేత సాధ్యసాంస్కృతికావ్య యీభావ సమాసములను గల్పింప వీలులేదు. తత్పురుషములో 'కృష్ణశ్రితుడు' అనునది ద్వితీయాతత్పురుషసమాసమైనను దానినుండి కృష్ణుని శ్రితుడు అని సాధ్యసమాసము గల్పింపరాదు. 'కృష్ణుని యాశ్రితుడు' అను సమాసము సాధ్యమయినను నది సంస్కృతసంప్రదాయార్థమును బట్టి ద్వితీయాతత్పురుషసమాస మనుకొనవలసినదే కాని రూపమున షష్ఠీతత్పురుషమే. ఇట్లే 'దు:ఖమునతీతుడు' అనుట తెనుగు సంప్రదాయము కాదు, దు:ఖమున కతీతుడనవలెను. గ్రామమునుగమి, అన్నమును బుభుక్షువు, మొదలగునవి తెనుగున నస్వాభావికములు. 'శంకుల ఖండము' అను చోట తెనుగున 'శంకులచేత ఖండము' అని యర్థము స్ఫురింపక 'శంకులయొక్క ఖండము' అనియే స్ఫురించును. 'యూపముదారువు' అనుచోట చతుర్థీ తత్పురుషసమాస మేర్పడుచున్నది; ఇట్లిచోట్ల 'ము' వర్ణమునకు పు వర్ణ మగు చుండును: యూపపుదారువు. దీపపుస్తంభము మొదలగునవి. 'చోరుని భయము' అనుచోట రూపమున షష్ఠీతత్పురుషసమాసమే కానవచ్చుచున్నది. గాని, పంచమీతత్పురుషము సిద్ధింపలేదు. 'ఈశ్వరుని యధీనము' అనుచోటను షష్ఠీతత్పురుష రూపమే కాని సప్తమీతత్పురుష రూపము లేదు.

సంస్కృత సంఖ్యావాచకపదములలో గొన్నిమాత్రము తత్సమము లగును. ఏకుడు బ్రాహ్మణుడు మొదలగు సమాసములు తెనుగున గలుగవుగదా. బ్రాహ్మణుల ద్వయము, వృక్షముల త్రయము, పుస్తకముల శతము, సైనికుల సహస్రము, భవనముల వింశతి మొదలగునవి సాధ్యములు గావచ్చునుకాని, వీనిలో సంఖ్యావాచకము పూర్వపదముగా లేదు; పుస్తకములు అనునది బహువచన మందున్నదీ; షష్ఠీరూపమును దాల్చియున్నది. అందుచేత నిట్టివానిని సాధ్యద్విగుసమాసములనుట సరికానట్లు తోచుచున్నది.

ఇట్లే యితర సమాసముల విషయమున గూడ జెప్పవలసియున్నది. 'ఘనశ్యాముడు' అనునది 'ఘనుడు శ్యాముడు' అనికాని, 'పురుషవ్యాఘ్రుడు' అనునది 'పురుషుడు వ్యాఘ్రుడు' అనికాని సాధ్యసమాసమగుటకు వీలులేదు. ఘనమువంటి శ్యామవర్ణము గలవాడు,ఇ 'వ్యాఘ్రమువంటి పురుషుడు', అని యీరీతిగా సమాసములను గల్పింతుమన్న వానిలో నాచ్ఛిక