పుట:Andhra bhasha charitramu part 1.pdf/813

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పై వానిలో సంస్కృతపదము సమాసమున బూర్వాంగముగా నున్నది; దానిపై నాచ్ఛికశబ్దము చేరినది. ఆచ్ఛికపద ప్రాతిపదిక రూపము పూర్వపదముగను సంస్కృతపదము పరమందునుగల సమాసములకు నిషేధమును లాక్షణికులు కల్పించినట్లు కానరాదు: అంచపదము, అంచయాన, అన్నప్పశాస్త్రి, అప్పలరాజు, అఱజాతి, ఉల్లిపాషాణము, ఎత్తుభారము, ఏలుకోట, ఒఱబీజము, కొఱప్రాణము, చూఱకారుడు, చొక్కతరము, తిరుచూర్ణము, తిరుపతి, తిరుమజ్జనము, తిరుమణి(వడము), తిరువారాధనము, తిరుమంత్రము, నడుమంతరము, పట్టెవర్ధనము, పుడమీశుడు, పెద్దరోగము, పొగబాణము, బారిముద్ర, కటికదరిద్రుడు, చిలుకద్వాదశి, బిడాలవణము, మట్టమధ్యాహ్నము, ముక్కోపము, మట్టితైలము, ముంగోపము, ముక్కోణము, కెంధూళులు, వసనాభి, వాటపద్యములు, వింజామరము, విన్నపత్రిక, కప్పతాళము, చిక్కుతాళము, చిటితాళము, బొమ్మచారి, సజ్జరసము మొదలగునవి సాధువులే. పుబ్బానక్షత్రము, బుక్కరాయసముద్రము, మచిలీపట్టణము, బరంపురము, కొర్లకోట, హండే అనంతపురము, బేస్తవారము, ముల్లగూరశక్తి, మొదలగునవియు నిట్టి సమాసములే.

ఆచ్ఛిక పదమునకు సంస్కృతప్రత్యయము చేరిన కొన్నిపదములు సమాసములయి తెనుగున నిలుచుచున్నవి: ఉదా. గరుటామంతుడు, గరుటాలమంతుడు ('కంబమయ్యరొ మేలుకలిగిన నీకొక్క గరుటాలమంతుని గానుకిత్తు-యయా. II; సిరిమంతుడు (నీలాసుం. I.); చెలికారము.

తత్సమ సమాసములు.

ఆధునిక వైయాకరణులు సంస్కృత సిద్ధసమాసములనేకాక సంస్కృత సమ పదముల సమాసములను నొకవిభాగమును జేసి వానికి సాధ్య సాంస్కృతిక సమాసములని పేరిడిరి. ఇట్టి విభాగమును గల్పించుట సమంజసము కానట్లు తోచుచున్నది. ఇట్టి సమాసములు సాధారణముగ నాచ్ఛిక సమాసముల తీరుననే యేర్పడుచుండును. వానిలోని పూర్వపదములం దెట్టి మార్పును గలుగదు; అనగా వానితుది విభక్తి ప్రత్యయములు లోపించవు. లోపించినచో నవి శుద్ధసాంస్కృతిక సమాసములే యగును. 'తటాకంబు నుదకము, చెఱువునుదకము, మొగమునందము' అను సమాసములలో మొదటి దానిలో దత్సమపదములును, రెండవదానిలో నాచ్ఛిక తత్సమ పదములును, మూడవదానిలో రెండును నాచ్ఛికపదములును నున్నను వాని రూపమునందెట్టి భేదమును లేదు. ఇట్లే లక్ష్మీవల్లభుడు, లక్ష్మిమగడు, లచ్చిమగడు అను వానియందును, ఇట్లే మాలసౌందర్యము, దండసౌందర్యము, దండ