పుట:Andhra bhasha charitramu part 1.pdf/791

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురుషుడు) అను సమాసమునకు 'రాజ్ఞ: పురుష:' (రాజుయొక్క పురుషుడు) అని యర్థవివరణము చేయుట లౌకికవిగ్రహము. 'తాజన్ + అప్ + పురుష + ను' (రాజన్ + అంత్యలోపము + ఉ + యొక్క + పురుష + ఉ + డుజ్) అని వివరించుట యలౌకిక విగ్రహము.

లౌకికవిగ్రహము చెప్ప వీలులేనిది నిత్యసమాస మనబడును; అనగా నా సమాసమందలిపదముల సంబంధమును వేర్వేఱుగ వివరించి చెప్ప సాధ్యముకాదు.

సమాసములు అవ్యయీభావము, తత్పురుషము, ద్వంద్వము, బుహువ్రీహి, యని నాలుగనియు, నవి వరుసగా పూర్వోత్త భయాన్యపదార్థ ప్రథానములనియు జెప్పుట యాచారము. కాని, యీ నిర్వచనము చాలదు. 'ఉన్మత్తగంగము' మొదలగు నవ్యయీభావసమాసములును, 'అతిమాలా' మొదలగు తత్పురుషసమాసములును, 'ద్రిత్రా' మొదలగు బహువ్రీహి సమాసములును, 'దంతోష్ఠము' మొదలగు ద్వంద్వసమాసములును బై నిర్వచనము ననుసరించి లేవు.

కర్మధారయము తత్పురుషభేదము; ద్విగువు కర్మధారయ భేదము, ద్వంద్వబహువ్రీహి సమాసములందు మాత్రము --------- నెక్కువపదములు చేరును.