పుట:Andhra bhasha charitramu part 1.pdf/792

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(ఒకదేశము). సమాసాంతమునవచ్చు 'పథిన్‌' శబ్దముమీదను 'అ' అను ప్రత్యయము చేరును: సఖిపథము, రమ్యపథము.

(3) ప్రతి, అను, అవ, అను నుపసర్గపూర్వకములగు 'సామన్, లోమన్‌' శబ్దములపై 'అచ్‌' అను ప్రత్యయము వచ్చును: ప్రతిసామము, అనుసామము, అవసామము, ప్రతిలోమము, అనులోమము, అవలోమము.

కృష్ణ, ఉదక్, పాండు, అను పదములును, సంఖ్యావాచకపదములును పూర్వమందుగల భూమిశబ్దముమీదను 'అచ్‌' ప్రత్యయము చేరును: కృష్ణభూమము, ఉదగ్భూమము, పాండుభూమము, ద్విభూమము (ప్రాసాదము).

సంఖ్యావాచకపదములు పూర్వమందుగల గోదావరీ, నదీశబ్దముల మీదను 'అచ్‌' ప్రత్యయము చేరును: సప్తగోదావరము, పంచనదము.

'అచ్‌' ప్రత్యయము మఱికొన్ని చోట్లను వచ్చును: పద్మనాభుడు, ఊర్ణనాభుడు, సమరాత్రము, దీర్ఘరాత్రము, అరాత్రము; వీనిలో నాభి, రాత్రి, శబ్దములపై 'అచ్‌' ప్రత్యయము చేరినది.

(4) 'అక్షి' శబ్దమునకు 'కన్ను' అనునర్థము లేనప్పుడును సమాసమున 'అచ్‌' ప్రత్యయము చేరును: గవాక్షము = వెలుతురుకొఱకు చేసిన కన్నము.

(5) అచతుర, విచతుర, సుచతుర; స్త్రీపుంసలు, ధేన్వవడుహములు, ఋక్సామములు, వాఙ్మనసములు; అక్షిభ్రువము, దారగవము, ఊర్వష్ఠీవము, పదష్ఠీవము, నక్తందివము, రాత్రిందివము, అహర్దివము, సరజసము, ని:శ్రేయసము, పురుషాయుషము, ద్వ్యాయుషము, త్ర్యాయుషము, ఋగ్యజుషము, జాతోక్షము, మహోక్షము, వృద్ధోక్షము, ఉపశునము, గోష్ఠశ్వము, అను నిరువదియైదుసమాసములును 'అచ్‌' ప్రత్యయము చేరుటవలన గలిగినవి.

(6) బ్రహ్మ, హస్తిశబ్దములకు బరముగా వచ్చు 'వర్చన్‌' శబ్దము తుదను 'అచ్‌' ప్రత్యయము చేరును: బ్రహ్మవర్చసము, హస్తివర్చసము. పల్య, రాజ శబ్దములమీదవచ్చు వర్చశ్శబ్దమునకును 'అచ్‌' ప్రత్యయము చేరును: పల్యవర్చసము, రాజవర్చసము.

(7) అవ, సమ్, అంధ అనువానిపై వచ్చు 'తమస్‌' శబ్దమునకును 'అచ్‌' ప్రత్యయము చేరును: అవతమసము, సంతమసము, అంధతమసము.

(8) సమాసమున 'శ్వ:' శబ్దముకంటె బరమైన 'వసీయస్, శ్రేయస్‌' శబ్దములమీదను 'అచ్‌' ప్రత్యయము చేరును: శ్వోవసీయసము, శ్వ:శ్రేయసము.

(9) అను, అవ, తప్త, అనుపదములపై వచ్చు 'రహస్‌' శబ్దమునకును 'అచ్‌' ప్రత్యయము చేరును: అనురహసము, అవరహసము, తప్తరహసము.