పుట:Andhra bhasha charitramu part 1.pdf/790

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నపుంసకలింగపదము శేషించును; కావున స్త్రీ నపుంసకలింగపదములలో నపుంసకలింగపదమే శేషించును.

సా చ దేవదత్తశ్చ = తౌ (ఆమెయు దేవదత్తుడును వారు. ఇచట తెనుగున పుంస్త్రీవాచకములకు బహువచనమున భేదములేదు. ) అదియు, దేవదత్తుడును; యజ్ఞదత్తయు 'అవి', అదియు దేవదత్తుడును 'అవి.' ఇది సంస్కృత సంప్రదాయము: తెనుగున అదియును ఆమెయును ననుటకు గాని అదియును వాడును అనుటకుగాని యేకశేష సమాసములు లేవు.

(9) గ్రామ్యపశువుల సంఘములందు తరుణములు గానివానిని దెలుపు పదములు కలిసినప్పుడు స్త్రీలింగపదము శేషించును: గోవులును వృషభములును 'గోవులు;' ఆడుమేకలును మగమేకలును 'అజములు'.

చీలిన డెక్కలుగల గ్రామ్యపశువులను దెలుపుపదములకు మాత్రమే యీ సూత్రము వర్తించును. ఇవి 'అశ్వములు' (మగవి, ఆడువి) - ఇచట పుంలింగపదము శేషించునది.

సర్వసమాసశేషము.

కృద్వృత్తి, తద్ధితవృత్తి, సమాసవృత్తి, ఏకశేషవృత్తి, సనాద్యంత ధాతురూపవృత్తి, అనివృత్తి యైదువిధములు. వృత్తియనగా ఒకపదము నర్థమునకు భిన్నమగు నర్థమును గల్పింప గలశక్తి; అర్థభేదమును గొంచెమయినను గల్పింప:జాలనిది వృత్తికాదు.

ధాతువునుండి మూలనామవాచకపదమును గల్పించుట కృద్వృత్తి; మూలనామవాచక పదమునుండి మఱియొక నామవాచక పదమును గల్పించునది తద్ధితవృత్తి; రెండుగాని యంతకంటె నెక్కువగాని పదములను జేర్చి యేకపదముగా జేయునది సమాసవృత్తి; అనేకపదములు సమసించునపు డందలి యొకపదమును మాత్రము శేషింపజేయునది యేకశేషవృత్తి; నామవాచకమునుండి క్రియాపదమునుగాని, యొక మూలక్రియాపదమునుండి మఱియొక క్రియాపదమునుగాని గలిగించునది ననాద్యంత ధాతురూపవృత్తి.

ఒకవృత్తి యర్థమును వివరించు కార్యమునకు విగ్రహమనిపేరు. విగ్రహవాక్యము మూలపదమునర్థ మేరీతిగ మాఱినదో తెలియ జేయును. విగ్రహము లౌకికమనియు, అలౌకికమనియు రెండువిధములు. సాధారణ భాషలో నర్థము ననుసరించి వివరింపబడినది లౌకికవిగ్రహము; వ్యాకరణ సంకేతములతో వివరింపబడినది యలౌకికవిగ్రహము. రాజపురుష: (రాజ