పుట:Andhra bhasha charitramu part 1.pdf/782

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'కొట్టుట' మొదలగు నర్థముగల పదముల తరువాతవచ్చు నిష్ఠాంత పదములును, సప్తమ్యర్థకపదములును సమాసమున నుత్తరపదములుగా నుండును: అమ్యద్యతుడు, దండపాణి - ఒకప్పు డిట్లు కాదు: విపృతాసి.

V. ద్వంద్వసమాసము.

(1) 'చ' (=మఱియు) అనునర్థమున ననేకములగు సుబంతపదములు వైకల్పికముగా సమసించును. సమసించునపుడు ద్వంద్వసమాసమగును. 'చ' అను నవ్యయమునకు (1) సముచ్చయము (2) అన్వాచయము (3) ఇతరేతరము (4) సమాహారము - అను నాలుగర్థములు గలవు. పరస్పరసంబంధములేని రెండు స్వతంత్రపదములు ఒకదానిప్రక్క నొకటిచేరుట సముచ్చయమనబడును: ఈశ్వరుని, గురువును భజింపుము. ఇచట 'ఈశ్వర', 'గురు' అనుపదములు స్వతంత్రములు; వానికి బరస్పరసంబంధములేదు. వీనికి సమసింప సామర్థ్యములేదు గావున సమాసము సిద్ధింపదు. ఈ యుదాహరణమున రెండుద్రవ్యము లేక క్రియతో నన్వయించుచున్నవి. 'రాజు యొక్క గజమును, అశ్వమును' అనుచోట పరస్పరసంబంధములేని రెండు పదములు మఱియొకవస్తువుతో సంబంధించుచున్నవి. 'వస్త్రము, రక్తమును, శుక్లమును;' ఇచట రెందు స్వతంత్రములగు గుణవాచక విశేషణములు, పరస్పరసంబంధములేనివి, యొకవిశేష్యముతో సంబంధించుచున్నవి. 'రక్తమైన వస్త్రమును కుండలమును,' ఇచట రెండు స్వతంత్రవిశేష్యములు, పరస్పర సంబంధములేనివి ఒకవిశేషణముతో సంబంధించుచున్నవి. ఇవికూడ సముచ్చయార్థమున కుదాహరణములే.

ఒకప్రధానకార్యము ననుసరించి యుపకార్యము కలుగుచున్నపు డా రెండుకార్యములను దెలుపుపదము లొకదానిప్రక్క నొకటిచేరుట 'అన్వాచయము'. 'భిక్షమునకు పొమ్ము, ఆవును తీసికొని వచ్చుట అది కనబడకపోయినచో గాక పోవచ్చును. భిక్షాటనము ప్రథానకార్యము; ఆవును తీసికొని వచ్చుట యుపకార్యము. కావున నిచటగూడ సమాసము సిద్ధింపదు.

'ధవఖదిరములు' అనుచోట 'ధవవృక్షము, ఖదిరవృక్షము' అనునవి యితరేతరసంబంధము గలిగినవి కావున సమాసము సిద్ధించుచున్నది. 'సంజ్ఞా పరిభాషము' అనుచోట సమాహారార్థము (వస్తువులకూడిక) గలిగి సమాసము సిద్ధించుచున్నది.

హోతృ, పోతృ, నేష్టృ, ఉద్గాతృ అనుపదములు సమసించి 'హోతృ ఫోతృ నేష్టో-ద్గాతారులు' అనికాని, 'హోతా పోతా నేష్టోద్గాతారులు' అని