పుట:Andhra bhasha charitramu part 1.pdf/783

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని యగును. మొదటి సమాసములో 'హోతృ, పోతృ' పదములపై నుత్తరపదములేదు గావున 'హోతా పోతా' అను రూపములను బొందలేదు. రెండవ సమాసములో 'హోతృ, పోతృ' శబ్దములు రెంటికిని, నేష్టృ, ఉద్గాతృ పదములు రెంటికిని బ్రత్యేకముగా సమాసములు గలిగినపిదప నా రెండు సమాసములును మఱల నొక పెద్దసమాసముగా జేరినవి.

(2) 'రాజదంత' మొదలగు సమాసములందు ఉపసర్జనసంజ్ఞగల పదము ఉత్తరపద మగును. దంతములకురాజు = రాజదంతము - రాజదంత, అగ్రేవణమ్, లిప్తాపసితమ్, నగ్నముషితమ్, సిక్తసంమృష్టమ్, మృష్టలుంచితమ్, అపక్లిన్నపక్వమ్, అర్పితోతమ్ (అర్పితోప్తమ్), ఉప్తగాఢమ్, ఉలూఖల, ముసలమ్, తండులకిణ్వమ్, దృషదుపలమ్, ఆరడ్వాయనీ (ఆరగ్వాయనబంధకీ), చిత్రరథబాల్హీకమ్, అవంత్యశ్మకమ్, శూద్రార్యమ్, స్నాతకరాజానౌ, విష్వక్సేనార్జునౌ, అక్షిబ్రువమ్, దారగవమ్, శబ్దార్థౌ, ధర్మార్థౌ, కామార్థౌ, అర్థశబ్దౌ, అర్థధర్మౌ, అర్థకామౌ, వైకారిమతమ్, గాజవాజమ్, గోజవాజమ్, గోపాలిధాన (-నీ)హలానమ్, హలానకారండమ్, (పూలానకకురండమ్), స్థూలానమ్ (స్థూలప--లానమ్), ఉశోరబీజమ్, (జిజ్ఞాస్థి), సిరజాస్థమ్ (సింజశ్వత్థమ్), చిత్రాస్వాతీ (చిత్రస్వాతీ), భార్యావతీ, కంపతి, జంపతి, జాయాపతీ, పుత్రపతీ, పుత్రవశూ, కేశశ్మశ్రు, (లేక, శ్మశ్రుకేశౌ), శిరోబీజమ్, శిరోజాను, సర్పిర్మధునీ, మధుసర్పిషీ, ఆర్య తౌ, అంతాదీ, గుణవృద్ధీ, వృద్ధిగుణౌ.

ధర్మాది పదములకు సమాసమున స్థాననియమము లేదుగావున బై పట్టికలో రెండేసి రూపములు చూపబడినవి.

(3) ద్వంద్వసమాసమున 'ఘి' అను వ్యాకరణసంజ్ఞగల పదము పూర్వపదముగా నుండవలెను. హరియు హరుడును 'హరిహరులు' అమాసమున 'ఘి' సంజ్ఞగల పదము లనేకము లున్నప్పుడు వానిలో దేనినైనను బూర్వపదముగ నుపయోగింపవచ్చును. హరియు, గురుడును, హరుడును 'హరిగురుహరులు' లేక 'హరిహరగురువులు.'

(4) అజాదియై దంత మగుపదము ద్వంద్వసమాసమున బూర్వపదమగును; ఈశుడును కృష్ణుడును 'ఈశకృష్ణులు.' అట్టి పదము లనేకము లున్నప్పుడు వానిలో దేనినైనను బూర్వపదముగ వాడవచ్చును: అశ్వరథేంద్రులు, ఇంద్రాశ్వరథులు. ద్వంద్వసమాసమున అజాదియు నదంతమునైన పదమే పూర్వపదమగును: 'ఇంద్రాగ్నులు' అనుచోట 'ఇంద్ర'పద మజాదియు నదంతమును నైనది; 'అగ్ని' అనునది యాజాదియైనను నదంతము కాదు. కావున నిచట 'అగ్ని' పదము పూర్వపదముకాదు. 'ఇంద్ర' అనునదే మొదట నిలిచినది.