పుట:Andhra bhasha charitramu part 1.pdf/780

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బరమందున్న 'కాకుద' శబ్దముతుది అకారము వైకల్పికముగ లోపించును: పూర్ణకాకుత్, పూర్ణకాకుద: (తె. పూర్ణకాకుత్తు, పూర్ణకాకుదము).

(36) సుహృద్, దుర్‌హృద్, శబ్దములు మిత్ర, శత్రు, అర్థములందు వచ్చు బహువ్రీహి సమాసములు. సు(దుర్) + హృదయ, అని యుండగా 'హృదయ' లోని 'అయ' లోపించినది.

(37) బహువ్రీహిసమాసములం దుత్తరపదములుగావచ్చు 'ఉరస్‌' మొదలగు పదములపై 'క(ప్)' ప్రత్యయమువచ్చును: ఉదా. ప్యూఢోరస్కుడు; ప్రియసర్పిష్కుడు మొదలయినవి.

ఉరస్, సర్పిస్, ఉపానహ్, పుమాన్, అనడ్వాన్, పయస్, నౌ:, లక్ష్మీ:, దధి, మధు, శాలి, అనర్థ - ఇవి ఉర:ప్రభృతులు.

(38) ఉత్తరపదము ఇనంతమయి, స్త్రీవాచకమగు బహువ్రీహిసమాసము తుదను 'క(ప్)' ప్రత్యయముచేరును: ఉదా. ఈ నగరి బహుదండిక; ఈ సభ బహువాగ్మిక.

(39) పై సమాసాంతములను గూర్చిన సూత్రములందు చెప్పబడని తక్కిన బహువ్రీహిసమాసములన్నిటికంటెను 'క(ప్)' ప్రత్యయము వైకల్పికముగా జేరును: మహాయశస్కుడు, మహాయశుడు మొదలయినవి.

(40) ఆ కారాంత స్త్రీలింగ శబ్దముపై 'క్(ప్)' ప్రత్యయము చేరునప్పు డా యాకారమునకు వైకల్పికముగా హ్రస్వము కలుగదు: బహుమాలాకుడు, బహుమాలకుడు - కప్ - ప్రత్యయము చేరనప్పుడు 'బహుమాలుడు.'

(41) బహువ్రీహిసమాసము సంజ్ఞావాచకమగునపుడు దానిపై - కప్ - ప్రత్యయము చేరదు: ;విశ్వేదేవుడు-' విశ్వేదేవకుడు' అనికాదు.

(42) 'ఈయస్‌' అనున దంతమందుగలది యుత్తరపదముగానుండు బహువ్రీహిసమాసమకంటె 'క(ప్)' ప్రత్యయమురాదు: ఉదా. బహుశ్రేయాన్, బహుశ్రేయసీ (తెనుగు: బహుశ్రేయాంసుడు, బహుశ్రేయసి).

(43) 'వందిత' అను నర్థముగల భ్రాతృశబ్ద ముత్తరపదముగాగల బహువ్రీహిసమాసముకంటె 'క(ప్)' ప్రత్యయమురాదు: సుభ్రాత - కాని, మూర్ఖభ్రాతృకుడు, దుష్టభ్రాతృకుడు.

(44) 'దేహావయవములు' అనునర్థమున నాడీ, తంత్రీపదములు బహువ్రీహిసమాసములం దుత్తరపదములుగా నున్నప్పు డా సమాసముకంటె 'క(ప్)'