పుట:Andhra bhasha charitramu part 1.pdf/779

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సూపపదీ, పంచపదీ, అర్వపదీ, స్తనపదీ, కలహంసపదీ, విషపదీ - ఇవి కుంభ పద్యాదులు.

బహువ్రీహిసమాసమున సంఖ్యావాచకముగాని, 'సు'గాని పూర్వమందుగల 'పాద'శబ్దము తుదియచ్చునకు లోపము గలుగును: ద్విపాత్, త్రిపాత్, సంపాత్ మొదలయినవి

(34) బహువ్రీహిసమాసమున సంఖ్యావాచకపదముగాని, 'సు' గాని పూర్వమందుగల 'దంత' శబ్దమునకు వయస్సును దెలుపునప్పుడు 'దత్‌' అను నాదేశము గలుగును: రెండుదంతములు గల వయస్సుగల బిడ్డ ద్విదన్ (తెనుగు: ద్విదనుడు? సుదంతుడు ?) ఇట్లే, త్రుదన్, చతుర్దన్, షోడన్, సుదన్ మొదలయినవి. స్త్రీవాచ్యమయినపుడు సుదతీ, ఏకదతీ, ద్విదతీ, మొదలయినవి. వయస్సు అను నర్థము లేనప్పుడు కరిద్విదంతము; నటుడు సుదంతుడు.

ఇతరపదములు పూర్వమందున్నను స్త్రీవాచకమయి సంజ్ఞాపదమయినప్పుడును 'దంత' శబ్దమునకు 'దత్‌' ఆదేశమగును: అయోదతీ, ఫాలదతీ - మొదలయినవి. సంజ్ఞావాచకము కానప్పుడు: సమదంతీ, స్నిగ్ధదంతీ మొదలైనవి.

శ్యావ, అరోక, అనుపదములు పూర్వమందుగల దంతశబ్దమునకును వైకల్పికముగ దత్, ఆదేశమగును: శ్యావదన్, శ్యావదంత:; అరోకదన్, అరోకదంత:; అనగా పండ్లు ఎడములేనివాడు; తెనుగు: శ్యావదంతుడు, అరోకదంతుడు.

'అగ్ర' అనుపద మంతమందుగల పదములును, శుద్ధ, శుభ్ర, వృష, వరాహ, అను పదములును పూర్వమందుగల దంతశబ్దమునకు బహువ్రీహిసమాసమున 'దత్‌' ఆదేశమగును: ఉదా. కుడ్మలాగ్రదన్, కుడ్మలాగ్ర దంత:; శుద్ధదన్, శుద్ధదంత:; శుభ్రదన్, శుభ్రదంత:; వృషదన్, వృషదంత:; వరాహదన్, వరాహదంత:.

(35) జంతువుల వయస్సునుగాని, యవస్థనుగాని తెలియజేయు బహువ్రీహిసమాసమున నుత్తరపదముగా నున్న 'కకుద'శబ్దము తుది అకారమునకు లోపము గలుగును: అజాతకకుత్, పూర్ణకకుత్. - అవస్థను తెలియజేయనపుడు 'శ్వేత కకుద:.'

మూడు కకుదములుగల యొక పర్వతవిశేషము 'త్రికకుత్‌'. ఇది సంజ్ఞావాచకపదము; తె. త్రికకుత్తు.

ఉద్, వి, అను నుపసర్గములు పూర్వమందుగల 'కాకుద' శబ్దము తుది అకారము లోపించును: ఉత్కాకుత్, వికాకుత్; - 'పూర్ణ' శబ్దముకంటె