పుట:Andhra bhasha charitramu part 1.pdf/778

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(30) బహువ్రీహిసమాసమున 'ఉత్, పూతి, సు, సురభి,' అనుపదములు పూర్వమందుగల 'గంధ' శబ్దము తుదియచ్చునకు 'ఇ' ఆదేశమగును: ఉద్గంధి, పూతిగంధి, సుగంధి, సురభిగంధి, తక్కిన పదములు పూర్వమందున్నచో 'వాతము తీవ్రగ్రంధము'. 'ఇ' ఆదేశము గంధశబ్దము గుణవాచక మగునపుడే కలుగును; ద్రవ్యవాచకమగుచో గాదు: పుష్పము సుగంధి; వాయువు సుగంధి; కాని, సుగంధద్రవ్యము లెవనికి గలవో వాడు 'సుగంధుడు (ఆపణికుడు).'

(31) బహువ్రీహిసమాసమున నేశబ్దము పూర్వమందున్నను 'అల్పము' అనునర్థముగల 'గంధ' శబ్దము పరమందున్నచో దాని తుదియచ్చునకు 'ఇ' ఆదేశమగును: ఈ భోజనము సూపగంధి (= కొంచెము పప్పుగలది); ఘృతగంధి (కొంచెము నేయిగలది).

(32) ఉపమానవాచక పూర్వపదముగల 'గంధ' శబ్దము తుదియచ్చునకును 'ఇ' ఆదేశము కలుగును: పద్మమువంటి గంధమెవనికి గలదో వాడు పద్మగంధి; ఇట్లే, ఉత్పలగంధి, కరీషగంధి మొదలయినవి.

(33) బహువ్రీహిసమాసమున నుత్తరపదముగా నున్న 'పాద' శబ్దమునకు బూర్వమున దానితో నుపమించిన వస్తువాచకపద మున్నప్పు డా పాద శబ్దము తుది ఆకారము లోపించును: హస్తి మొదలగు శబ్దములు పూర్వమందున్నచో లోపము గలుగదు: వ్యాఘ్రపాత్ (తె. వ్యాఘ్రపాత్తు); కాని, హస్తిపాద: = హస్తిపాదుడు.

హస్తి, కుద్దాల, అశ్వ, కశిక, కురుత, కటోల, కటోలక, గండోల, గండోలక, కండోల, కండోలక, అజ, కపోల, జాల, గండ, మహేలా, దాసీ, గణికా, కుసూల - ఇవి హస్త్యాదులు.

'కుంభపదీ' మొదలగు సమాసములందును 'పాద' శబ్దము తుది అకారము లోపింపగా దానిపై స్త్రీ ప్రత్యయము చేరునప్పుడు 'పాత్‌' నకు 'పద్‌' ఆదేశము గలిగినది. స్త్రీప్రత్యయము చేరనిచో 'అ'కారలోపము గలుగును; కుంభపాద: = కుంభపాదుడు.

కుంభపదీ, ఏకపదీ, జాలపదీ, శూలపదీ, మునిపదీ, గుణపదీ, శతపదీ, సూత్రపదీ, గోధాపదీ, కుశలీపదీ, విపదీ, తృణపదీ, ద్విపదీ, త్రిపదీ, షట్పదీ, దాసీపదీ, శితి(త)పదీ, విష్ణుపదీ, సుపదీ, నిష్పదీ, ఆర్ద్రపదీ, కుణి(-ణ)పదీ, కృష్ణపదీ, శుచిపదీ, ద్రోణ(-ణీ)పదీ, ద్రుపదీ, సూకరపదీ, శకృత్పరీ, అష్టాపదీ, స్థూల(-ణా)పదీ, ఆపదీ, సూచీపదీ, మాజాపదీ, గోపదీ, ఘృతపదీ