పుట:Andhra bhasha charitramu part 1.pdf/775

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(10) తుల్యయోగమున 'సహ' అను పదము తృతీయా విభక్త్యర్థక పదముతో సమసించి బహువ్రీహిసమాస మగును; ఇట్టి 'సహ'కు వైకల్పికముగా 'స' యాదేశమగును. సపుత్రుడు; సహపుత్రుడు; తాము వివాహమునకు సకుటుంబలుగ దయచేయవలెను - ఆశీరర్థమున 'సహ' కు 'స' కలుగదు. సహపుత్త్రుడగు (సహామాత్యుడగు) రాజునకు స్వస్తి యగుగాక! ఆశీరర్థమున 'గో, వత్స, హల' శబ్దములకు బూర్వమున జేరిన 'సహ'కు సాదేశము వైకల్పికముగ నగును: సహపత్సుడవగు (సపత్సుడవగు) నీకు; సహహలుడవగు (సహలుడవగు) నీకు - శుభమగుగాక!

(11) బహు, గణ, అను పదములతో నంతముగానట్టియు, సంఖ్యావాచకమును దెలుపు నట్టియు బహువ్రీహిసమాసము తుదిని 'డచ్‌', ప్రత్యయము వచ్చును. ఉదా. ఉపదశములు.

['నిస్త్రింశ' మొదలగు సంఖ్యావాచకపదములుగల తత్పురుషసమాసముల తుదనుగూడ 'డచ్‌' ప్రత్యయము చేరును. చైత్రునికి నిస్త్రింశములు వర్షములు గడచినవి = ముప్పదియేండ్లు దాటినవి; ఖడ్గము నిస్త్రింశము = పమ్పుది యంగుళములకంటె నెక్కువ నిడివిగలది.]

(12) సక్థి, అక్షి, అనుపదములు బహువ్రీహిసమాసమున పరపదములుగా జేరి దేహమునందలి యవయవములను సూచించునప్పుడు సమాసము తుదను షచ్ - ప్రత్యయము వచ్చును: దీర్ఘములగు సక్థులు గలవాడు దీర్ఘ సక్థుడు; జలజాక్షి; కాని, దేహావయవముల యర్థములేదు గావున 'శకటము దీర్ఘ సక్థి, వేణుయష్టి స్థూలాక్షము' మొదలయినవి.

(13)'అంగులి' శబ్దము పరముగానుండి 'కట్టెముక్క' అనునర్థముగల బహువ్రీహిసమాసముతుదను షచ్ ప్రత్యయముచేరును: ఈ దారువు పంచాంగులము.

(14) ద్వి, త్రి అనుపదములు పూర్వమదు గలిగి 'మూర్ధన్‌' అనుపద ముత్తరపదముగా నున్న బహువ్రీహిసమాసములందు ష - ప్రత్యయము వచ్చును: ద్విమూర్ధుడు, త్రిమూర్ధుడు.

(15) అంతర్, బహిన్, అనుపదములు పూర్వమందును లోమన్ శబ్దము పరమందును గల బహువ్రీహిసమాసముతుదను 'అప్‌' ప్రత్యయము వచ్చును. అంతర్లోమము, బహిర్లోమము (వస్త్రము).

(16) 'నాసికా' శబ్దము పరపదముగా గలిగిన బహువ్రీహిసమాసమున 'నాసిక'కు 'నస్‌' ఆదేశమయి, సంజ్ఞావాచకమగునపు డాసమాసము