పుట:Andhra bhasha charitramu part 1.pdf/774

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(3) 'ఠక్‌', 'ఛన్‌' అను ప్రత్యయములకు బూర్వమందును స్త్రీలింగ శబ్దములు పుంలింగరూపముల బొందును: ఉదా. భవత్యా: ఛాత్రా: = భవత్కా:, భవదీయా: = తె. భవత్కులు, భవదీయులు.

(4) 'కుక్కటీ' మొదలగు శబ్దములు 'అండ' మొదలగు శబ్దములకు బూర్వమందు చేరి పుంలింగరూపముల దాల్చును: ఉదా. కుక్కటి యొక్క అండము 'కుక్కుటాండము; మృగియొక్క పదము 'మృగపదము', మృగియొక్క క్షీరము 'మృగక్షీరము; కాకియొక్క శావము 'కాకశావము,' మొదలయినవి.

(5) స్త్రీప్రత్యయాంతమగు స్త్రీలింగశబ్దము జాతివాచక మగునపుడు సమాసమున బుంలింగ రూపమును బొందదు: శూద్రాభార్యుడు, బ్రాహ్మణీభార్యుడు.

(6) అవ్యయములును, ఆపన్న, అదూర, అధిక, అను పదములును, సంఖ్యావాచకపదములును సంఖ్యావాచకార్థమున సంఖ్యావాచకపదములతో సమసించి బహువ్రీహిసమాసములగును: ఉదా. ఉపదేశములు = పదికి దగ్గఱగానుండు సంఖ్యలు, అనగా 9 లేక 11; ఉపవింశములు = ఇరువదికి దగ్గఱగానుండు సంఖ్యలు, అనగా 19 లేక 21 - ఇట్టిసమాసమున 'వింశతి' శబ్దములోని 'తి' వర్ణమునకు లోపము గలుగును: ఉదా. ఆసన్నవింశములు; అదూరత్రింశములు, అధికచత్వారింశములు; 'రెండుగాని మూడుగాని;' 'ద్విత్రములు;' రెండుపదులు = ద్విదశములు మొదలయినవి.

(7) రెండు దిగ్వాచక పదములు సమసించి యారెండు దిక్కులకును మధ్యనుండు దిక్కును సూచించినచో బహువ్రీహిసమాస మగును: దక్షిణముయొక్కయు పూర్వముయొక్కయు దిక్కుల యంతరాలము 'దక్షిణపూర్వ;' ఇట్లే 'పూర్వోత్తర' మొదలగునవి. రూఢియగు దిగ్వాచకములకే యీ కార్యమ కలుగును; యౌగికార్థమునగాదు: ఐంద్రీదిక్కునకును కాబేరీదిక్కునకును మధ్యనుండు అంతరాలము అనునపుడు సమాసము కాదు.

(8) 'ఇది దీనిలో, లేక, దీనిచేత గలిగినది. అను నర్థమున సరూపపదములలో పూర్వపదము తుదియచ్చునకు దీర్ఘము కలిగి బహువ్రీహిసమాస మేర్పడును: కేశాకేశి, దండాదండి, ముష్టీముష్టి మొద. తెనుగున 'ముష్టాముష్టి' అనియు నందురు; 'కేశాకేశి' మొదలగు రూపముల సాదృశ్యమున నీరూపము తెనుగున నేర్పడినది.

(9) అ సంజ్ఞ గల ప్రాతిపదికము తుది ఉ, ఊ లకు గుణము కలుగును: ఉదా. బాహూబాహవి.