పుట:Andhra bhasha charitramu part 1.pdf/773

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(6) బహువ్రీహిసమాసముల యంతమందు వచ్చు కప్ ప్రత్యయమునకు బూర్వమందుండు ఆ, ఈ, ఊ అను నచ్చులకు హ్రస్వము గలుగదు. పై సూత్రమువలన కల్యాణ పంచమిక: అను సమాసము సిద్ధింపవలసి యుండగా నీ సూత్రమువలన నట్టి రూపము నిషిద్ధమయినది. ఇట్లే, బహుకుమారీకుడు, బహులక్ష్మీకుడు, బహువృషలీకుడు మొదలగు రూపములు సిద్ధించుచున్నవి.

(7) ఊజ్ - అంతము కానట్టియు, పుం రూపము గలిగినట్టియు స్త్రీలింగమగు పదము 'త్ర, తస్, తర(ప్), తమ(ప్), చర(ట్), జాతీయ(ర్), కల్ప(ప్), (దేశ్య), దేశీయ(ర్), రూప(ప్), పాశ(ప్), (ధమ), ధాల్, (దా,గిహ్‌ల్, తి(ల్), థ్య(న్), తాతి(ల్), అను ప్రత్యయములకు బూర్వమందు పుంలింగ రూపమును బొందును: ఉదా. బహ్వీ + త్ర = బహుత్ర; బహ్వీ + తస్ = బహుత:; దర్శనీయతరా, దర్శనీయతమా, పటుచరీ, పటుజాతీయా, దర్శనీయ కల్పా, దర్శనీయదేశీయా, దర్శనీయరూపా, దర్శనీయపాశా, బహుధా, ప్రకతి: ప్రశస్తావృకీ, అజథ్యా = అజాభ్యో హితా, మొదలయినవి. పై ప్రత్యయముల ముందే కాక కొన్ని స్త్రీలింగ శబ్దములను మఱికొన్ని ప్రత్యయములకు బూర్వమున పుంలింగరూపము గలుగును.

i. బహు, అల్ప అను పదముల స్త్రీలింగరూపములు 'శస్‌' ప్రత్యయమునకు బూర్వము పుంలింగ రూపములను దాల్చును: ఉదా. బహ్వీభ్యోదేహి = బహుశోదేహి, అల్పాభ్యో దేహి = అల్పశోదేహి.

ii. స్త్రీలింగమున నున్న విశేషణము 'త్వ' 'త(ల్)' ప్రత్యయములకు బూర్వము పుంలింగ రూపమును బొందును: శుక్లాయా: భావ: = శుక్లత్వమ్ (తె. శుక్లత్వము); ఇట్లే, శుక్లతా (తె. శుక్లత.)

iii. స్త్రీలింగ శబ్దము 'ఢ' అను తర్ధిత ప్రత్యయమునకు బూర్వమందు తప్ప, తక్కిన భ - సంజ్ఞగల తద్ధిత ప్రత్యయములకు బూర్వమందు పుంలింగ మగును: హస్తినీనామ్ సమూహ: = హాస్తికమ్ (తె. హాస్తికము); సపత్నీ అను పదమునకు మూడర్థములు గలవు. (1) సపత్నుడు = శత్రువు. వాని భార్య 'సపత్ని' (2) ఎవతెకు సమానుడగు మగడు గలడో ఆమె, ఈ యర్థమున 'సపత్నీ' శబ్దమునకు బుంలింగరూపము లేదు. (3) ఎవతెకు సమానుడగు యజమానుడు (మగడుకాడు), కలడో ఆమె, సపత్నియొక్క అపత్యము అని చెప్పవలసినప్పుడు మొదటి రెండర్థములందును 'సాపత్నుడు' అనియు, మూడవ యర్థమున సాపత్యుడనియు రూపములు గలుగును.