పుట:Andhra bhasha charitramu part 1.pdf/776

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తుదిని 'అచ్‌' అను ప్రత్యయముచేరును; నాసికాశబ్దమునకు బూర్వమందు 'స్థూల' అనుపదము చేరినచో నీ ప్రత్యయమురాదు. ఇట్టిసమాసమందు పూర్వపదము నంతమున 'గ' వర్ణము లేకుండినచో 'నస్‌' లోని నకారమునకు ణకారమాదేశమగును: ఉదా. ద్రుణసుడు, ఖరణసుడు. కాని, 'వరాహము స్థూలనాసికము' - ఖుర, ఖర, అనుపదములపై వచ్చు నాసికా శబ్దమునకు 'నస్‌' ఆదేశమగునుగాని అవ్ - ప్రత్యయము చేరదు: ఖురణా: (తె. ఖురణుడు); ఖరణా: (తె. ఖరణుడు).

(17) ఉపసర్గపూర్వకమయిన 'నాసికా' శబ్దమునకు 'నస్‌' ఆదేశమయి సమాసముతుదను అచ్ - ప్రత్యయము చేరును: ఉదా. ఉన్నసుడు = ఉన్నతమైన ముక్కు ఎవనికి గలదో వాడు.

(18) ఉపసర్గముకంటె పరమైన 'నస్‌' అనుపదమునందలి నకారమున ణకారము గలుగుటకు గారణమున్నచో నట్టిమార్పు బహులముగా గలుగును: ప్రణసుడు (విగతమైన నాసిక గలవాడు 'విగ్రుడు;' లేక 'విఖ్యుడు').

(19) సుపాత్ర, సుశ్వ, సుదివ, శారికుక్ష, చతురస్ర, ఏణిపద, అజపద, ప్రోష్ఠపద, - అనునవి అచ్ - ప్రత్యయముతో జేరిన బహువ్రీహిసమాసములు. ఇవి వ్యాకరణసూత్రముల నతిక్రమించినవి.

(20) హలి, సక్థి, అనుపదములకు బూర్వమున 'నఞ్‌' గాని, 'దుస్,ను,'లుగాని ఉండి, బహువ్రీహిసమాసమున నవి పరపదములుగా నున్నచో నా సమాసము తుదను అచ్ - ప్రత్యయము వైకల్పికముగా జేరును: అహిలుడు, అహలి; దుర్హలుడు. దుర్హలి; సుహలుడు, సుహలి; అసక్థుడు, అసక్థి, సుసక్థుడు, సుసక్థి; సుస్సక్థుడు, దుస్సక్థి.

(21) నఞ్, దుస్, సు, ప్తత్యయములు పూర్వమందుగల ప్రజా, మేధా, శబ్దము లంతమందుగల బహువ్రీహిసమాసము 'తుదను 'అసిచ్‌' ప్రత్యయముచేరును:- అప్రజా: (అప్రజుడు), దుష్ప్రజా: (దుష్ప్రజుడు), సుప్రజా: (సుప్రజుడు); అమేధా: (అమేధుడు); దుర్మేధా: (దుర్మేధుడు), సుమేధా: (సుమేధుడు).

(22) బహువ్రీహిసమాసమున పూర్వపదము సమస్తపదముకాక, ఉత్తరపదము మఱియొక పదముతో గూడని 'ధర్మ' శబ్దమైనయెడల, దానిపై 'అనిచ్‌' (అన్) ప్రత్యయము చేరును: కల్యాణధర్మస్, ప్రథమైకవచనమున కల్యాణధర్మా, లేకున్నచో 'పరమధర్మ:'. తెనుగున నీరెండు సందర్భములందును నొకటేవిధమగు రూపము గలుగును: కల్యాణధర్ముడు, పరమస్వధర్ముడు.