పుట:Andhra bhasha charitramu part 1.pdf/764

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నభ్రాజ్, నపాత్, నవేదమ్, నానత్యౌ, నముచి, నకుల, నఖ, నపుంసక, నక్షత్ర, నక్ర, నాక, - అను పదములలో 'నఞ్‌' లోని నకారమునకు లోపము కలుగదు.

ప్రాణీవాచకముకాని 'నగ' అను పదమునందు 'నఞ్‌' లోని నకారమునకు లోపము వైకల్పికముగా నగును: నగము, అగము = చెట్టు, కొండ; వృషలుడు చలిచే 'అగు' డగుచున్నాడు, అనుచో 'కదలలేకున్నాడు' అని ప్రాణివాచకమును దెలుపుటచేత నకారమునకు లోపము గలిగినది.

(26) (i) 'కు' అను నవ్యయమును, (ii) 'గతి' సంజ్ఞగల ప్రత్యయములును, (iii) ప్రాదులును నితర పదములతో సమసించును: ఉదా. i. కుపురుషుడు.

(ii) ఊరీ ప్రభృతులును, చ్వి, డాచ్ ప్రత్యయాంతశబ్దములును వ్యాకరణమున 'గతి' యనుసంజ్ఞను పొందుచున్నవి. - ఊరీ, ఉరరీ, వేతాలీ, ధూసీ, శకలా, స్రంసకలా, ధ్వంసకలా, భ్రంసకలా, గులుగుధా, సజూ:, ఫల, ఫలీ, విక్లీ, అక్లీ, అలోష్టీ, కేవాలీ, సేవాలీ, శేవాలీ, వర్షాలీ, మనమసా, మన్మసా, వౌషట్, వషట్, శ్రౌషట్, స్వాహా, స్వథా, పాంపీ, ప్రాదు:, శ్రత్, ఆవిస్ - ఇవి ఊరీప్రభృతులు - పాంపాలీఇ, సంకలా, కేవాసీ, వాదాలీ, పాదాలీ, అలంబీ, అంగీ, తంథీ, తాలీ, అతాలీ, ధూలీ, ఆశ్మసా, వశలా, మష్మసా, బంధా మొదలగునవియు నూరీప్రభృతులలో పఠింపబడు చున్నవి.

చ్వి - ప్రత్యయాంతపదములకు: శుక్లీకృతము, దూరీకృతము మొదలయినవి.

డాచ్ - ప్రత్యయాంతపదములకు: వటపటాకృతము మొదలయినవి.

'ఇతి' అను పదము పరముగాలేని యనుకరణ శబ్దములును గతి సంజ్ఞకము లగును. ఉదా. ఖాట్‌కృతము, యత్‌ఖాట్‌కృతము మొదలయినవి.

'నత్‌' అనుపద మాదరార్థమునందును, 'అనత్‌' అనుపదము అనాదరార్థమందును గతి సంజ్ఞకములగును. సత్కృతము, అనత్కృతము.

'అలమ్‌' అను పదము క్రియతో గలిసి భూషణార్థమును బొందునపుడు గతిసంజ్ఞను పొందును: అలంకారము, అలంకరణము.

'అంతర్‌' అను పదము అపరిగ్రహార్థమున గ్రియతో సమసించునపుడు గతిసంజ్ఞక మగును: అంతర్గ్రహము = అపరిగ్రహము.

'కణే', 'మనస్‌' అను పదములు క్రియాపదముతో గూడినప్పుడు శ్రద్ధాప్రతీ ఘాతార్థమున (తృప్తిచే అసహ్యము కలుగుట) గతిసంజ్ఞను పొందును: