పుట:Andhra bhasha charitramu part 1.pdf/763

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యాకృతిగణ మగుటచేత అకుతోభయ, కాందిశీక, అహోపురుషికా, అహమహమికా, యదృచ్ఛా, ఏహిరేయాహిరా, ఉన్మృజవిమృజా, ద్రవ్యాంతరమ్, అవశ్యకార్యమ్, మొదలగు సమాసములును సిద్ధించుచున్నవి.

'ఏహీడ' మొదలగు పదము లన్యపదార్థమును దెలుపుచు దత్పురుష సమాసము లగును: ఏహీడమ్, ఏహిపచమ్, ఏహివాణిజా, అపేహివాణిజా, ప్రేహివాణిజా, ఏహిస్వాగతా, అపేహిస్వాగతా, ఏహిద్వితీయా, అపేహిద్వితీయా, ప్రేహిద్వితీయా, ఏహికటా, అపేహికటా, ప్రేహికటా, ఆహరకరటా, ప్రేహికరటా, ప్రేహికర్దమా, ప్రోహికర్దమా, విధమచూడా, ఉద్ధమచూడా, ఆహరచేలా, ఆహరవనితా, ఆహరవసనా, కృంతవిచక్షణా, ఉద్ధరోత్సృజా, ఉద్ధరాపసృజా, ఉద్ధమవిధమా, ఉత్పచనిపచా, ఉత్పతనిపతా, ఉచ్చావచమ్, ఉచ్చనీచమ్, ఆచోపచమ్, ఆచపరాచమ్, నిశ్చప్రచమ్, అకించన:, స్నాత్వాకాలక:, పీత్వాస్థిరక:, భుక్త్వాముహిత:, ప్రోష్యపాపీయాన్, ఉత్పత్యపాకలా, నిపత్యరోహిణీ, నిషణ్ణశ్యామా, అపేహిప్రఘణి, ఏహివిఘసా, ఇహపంచమీ, ఇహద్వితీయా - ఇవి ఏహీడాదులు.

'జహి' అను క్రియాపదము ఆభీక్ష్ణ్యార్థమున (మఱియు మఱియు ననునర్థమున) దాని కర్మపదముతో సమసించి తత్పురుష సమాసమయి కర్తృ పదమును దెలుపును: జహిజోడుడు = 'జహిజోడ' అని పలుమా రనువాడు, జహిస్తంబుడు = 'జహిస్తంబ' అని పలుమా రనువాడు.

(24) 'ఈషత్‌' అను పదము కృదంతముకాని గుణవాచకపదముతో సమసించి తర్పురుష సమాసమగును: ఈషత్కడారము = కొంచెము గర్వము; ఈషత్పింగలము = కొంచెము పింగలవర్ణము; ఈషద్వికటము = కొంచెము వికటము; ఈషదున్నతము = కొంచెము ఎత్తు; ఈషత్పీతము = కొంచెము పచ్చన, ఈషద్రక్తము = కొంచెము ఎఱుపు మొదలయినవి.

(25) 'అభావద్యోతకమగు 'నఞ్‌' అనునది సుబంతముతో సమసించి తత్పురుషసమాసమగును.

అట్లు సమసించునపుడు 'న' లోని నకారము లోపించును: న + బ్రాహ్మణుడు = అ + బ్రాహ్మణుడు = అబ్రాహ్మణుడు.

కాని, ఉత్తరపదము అజాదియైనయెడల 'అ' కారముపై నకారము చేరును: ఉదా. న + అశ్వము = అ + అశ్వము = అ + న్ = అశ్వము = అనశ్వము; న + అంతము = అ + అంతము = అ + న్ + ఆంతము = అనంతము మొదలయినవి.