పుట:Andhra bhasha charitramu part 1.pdf/745

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కము. అవధారణార్థమునగాక యితరార్థములందు సమాసము కలుగదు: ఉదా. యావద్దత్తం తావద్భుక్తమ్ (మయా) = 'ఇచ్చినంత కాలమును తింటిని' అనగా ఎంతతింటినో తెలియదని యర్థము; కావున సమాసము సిద్ధింప లేదు.

'ప్రతి' యను నవ్యయము మాత్రార్థమున, అనగా 'కొంచెము' అను నర్థమున సుబంతముతో సనుపించును: ఉదా. శాకప్రతి = కొంచెముకూర; సూపప్రతి = కొంచెముపప్పు. మాత్రార్థము లేనప్పుడు: 'వృక్ష, వృక్షంప్రతి విద్యోతతే విద్యుత్‌' = మెఱపు వృక్షము వృక్షమువైపునకును మెఱయుచున్నది. ఇచట సమాసము కలుగలేదు. ఇట్టి సమాసములకు దెనుగునం బ్రచారము లేదు.

అక్ష, శలాకా, పదములును, సంఖ్యావాచకపదములును, 'పరి' అను నవ్యయముతో సమసించును. అక్ష, శలాకా, పదములకు దమందలి పాచికలని యర్థము: ఉదా. క్షపరి, శలాకాపరి, ఏకపరి. ఇట్టి సమాసములకును దెనుగున బ్రచారములేదు.

అప, పరి, బహిస్, అను నవ్యయములును, 'అ చు' అనున దంతమందుగల యవ్యయములును (అనగా 'ఉదంచ్,' 'ద్రాంచ్‌' మున్నగునవి) పంచమీ విభక్త్యయములతో వైకల్పికముగా సమసించును: ఉదా. అపవిష్ణు సంసార: అవవిష్ణో; ----- (సంసారము విష్ణువునకు బయటనున్నది): పరిత్రిగర్తేభ్య: = త్రిగర్తదేశమునకు చుట్టును, బహిర్గ్రామం,బహిర్గ్రా మాత్ = గ్రామమునకు బయట, ప్రాగ్ గ్రామ, ప్రాగ్ గ్రామాత్ = గ్రామమునకు దూర్పున. తెనుగున బందమీరూపముతోడి సమాసములు కలుగవు.

'ఆజ్‌' అను నవ్యయము మర్యాద, అంతవఱకు, అభివిధి = హద్దును కలుపుకొని, అను నర్థములందు సుబంతములతో వైకల్పికముగా సమసించును: ఉదా. మర్యాదార్థమున: ఆముక్తిసంసార: ఆముక్తే: సంసార: = ముక్తి వఱకును సంసారము; అభివిధ్యర్థము: ఆబాలకు హరిభక్తి:, ఆబాలేభ్య: హరిభక్తి: = బాలురవఱకును (బాలురను కలిపి) హరిభక్తి.

అభి, ప్రతి, అను నవ్యయములు 'వైపు' అనునర్థమున దేనివైపునకో తెలియజేయు సుబంతపదముతో వైకల్పికముగా సమసించును: ఉదా. అభ్యగ్ని శలభా: వతంతి, అగ్నిమభిశలభా: వతంతి = శలభములు అగ్నివైపు పడుచున్నవి.