పుట:Andhra bhasha charitramu part 1.pdf/744

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రూపమ్ (తె. -ము) = తగినట్లు; (2) ప్రత్యర్థమ్ (తె. -ము) = అర్థము ననుసరించి; (3) యథాశక్తి = శక్తినతిక్రమింపక (4) సహరి = హరినిపోలిన.

(11) అనుపూర్వవచనము: ఉదా. అనుజ్యేష్ఠం ప్రవిశంతు భవంత: = తాము అనుజ్యేష్ఠము (గా) ప్రవేశింతురుగాక; అనగా మొదట అందఱికంటె బెద్దవాడు, తరువాత నంతకంటె చిన్నవాడు, ఈ రీతిగా వయసునుబట్టి యని యర్థము.

(12) యౌహపద్యవచనము: ఉదా. సచక్రందేహి = చక్రముతో గలిపియిమ్ము; ఇచట 'సహ' అను నవ్యయమునకు 'స' ఆదేశమయినది : కాలార్థమున 'సహ' కు 'స' ఆదేశముకాదు. 'సహపూర్వాహ్ణము' అనవలెనుగాని, 'సపూర్వాహ్ణము' అని యనగూడదు.

(13) సాదృశ్య వచనము: ఉదా. ససఖి = మిత్రునివలె. (10) లోయాధార్థ్య వచనమున సాదృశ్యార్థమిమిడియున్నను గుణభూత సాదృశ్యార్థమునను సమాసమ గలుగునని చెప్పుట కీ యర్థము పునరుక్తము చేయబడినది.

(14) సంపత్తి వచనము: ఉదా. సనక్షత్త్రమ్ (తె. - ము); సమృద్ధి యనగా ఎక్కువవతనము: సంపత్తి యనగా స్వభావానుకూలత.

(15) సాకల్యవచనము: ఉదా. సతృణమ్ (అత్తి), తె. -ము (తినుము); అనగా తృణముకూడ విడువక యని యర్థము. కేవలము. గడ్డిపోచను కూడ తినుమని యర్థము కాదు. సమస్తమును, దేనిని విడువకుండ నని యర్థము.

(16) అంతవచనము: ఉదా. సాగ్ని = అగ్నిని గూర్చిన వేదమందలి తుది యధ్యాయముతో గూడనని యర్థము.

'యథా' యను నవ్యయము సాదృశ్యార్థమునగాక తక్కిన యర్థములందు సమాసములందుచెరును: ఉదా. యధావృద్ధమ్ బ్రాహ్మణానా మామంత్రయస్వ = వృద్ధబ్రాహ్మణుల నందఱిని పిలువుము. ఇచట సాదృశ్యార్థము లేదు. "యధాహరిస్తధాహర:" అనుచోటసాదృశ్యార్థము కలదు కావున సమాసము కలుగదు.

'యావత్‌' అను నవ్యయము అవధారణార్థమున సమాసమునందు కలియును: ఉదా. యావత్తైలం తావద్వ్యాఖ్యానమ్ = ఎంతవఱకు దీపమునకు చమురుండునో అంతవఱకు వ్యాఖ్యానము; యావదమత్రం బ్రాహ్మణానా మామంత్రయస్వ = కుండ లెన్ని యున్నవో అంతమంది బ్రాహ్మణులను పిలువుము; యావచ్లోకం ప్రణమా: = శ్లోకములెన్ని యున్నవో అన్నిసార్లు ప్రణామములు. తెనుగున: యావత్తైలము; యావదమత్రము; యావచ్చ్లో