పుట:Andhra bhasha charitramu part 1.pdf/743

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మద్రులసమృద్ధి; సుమగధము = మగధులసమృద్ధి: ఇట్లే, ఉన్మత్తగంగము,లోహితగంగము, ఏకవింశతిభారద్వాజము మొదలయినవి.

అవ్యయీభావ సమాసములం దవ్యయములకు సాధారణముగ నీయర్థములలో నొకటి యుండును.

(1) విభక్తి వచనము: ఉదా. అధిహరి. ఇందు 'అధి' అను నుపసర్గమునకు సప్తమ్యర్థము గలదు; కావున సప్తమ్యంత పదములకు గలుగు కార్యము దీనికినిగలిగి, 'అధి' యుపసర్జనమయి సమాసమున బూర్వపదముగనిలిచి, సమాసము నపుంసక లింగమగుచున్నది.

(2) సమీపవచనము: ఉదా> ఉపకృష్ణమ్ = కృష్ణునికి సమీపము. తెనుగు: ఉపకృష్ణము. కాని, యన్ని సమీపార్థ కావ్యములకును సమాస కార్యములు కలుగవు. అభిత:, పరిత:, సమయా, నికషా, హా, అను నవ్యయములు ద్వితీయాకారకము గలవి. అట్లే, అన్యార్థకావ్యయములును, ఆరాత్, ఇతర, ఋతే, అనునవియు బంచమీకారకము గలవి వీనిలో సమయా, నికషా, ఆరాత్, లనునవి సమీపవాదకావ్యయము లయినను సమాసములందు చేరవు. ఉదా: సమయాగ్రామమ్, నికషాలంకం, ఆరాద్వనాత్ మొదలయినవి.

(3) సమృద్ధివచనము: ఉదా. సుమద్రం (తెనుగు: సుమద్రము); సుమగధమ్ (తెనుగు: సుమగధము) మొదలయినవి.

(4) వ్యృద్ధివచనము: 'వ్యృద్ధి' యనగా వృద్ధిలేనిది. ఉదా: దుర్యవనమ్ (తెనుగు: దుర్యవనము).

(5) అభావ వచనము: ఉదా. నిర్మక్షికమ్ (తె. -ము); నిర్మశకమ్. (తె. -ము) మొదలయినవి.

(6) అత్యయవచనము: అత్యయమనగా'పోవుట, నశించుట.' ఉదా: నిర్హిమఘ్ (తె. -ము); అతిహిమమ్ (తె. - ము).

(7) అసంప్రతివచనము: ఉదా. అతినిద్రమ్ (తె. -ము.) = వేళయతిక్రమించిన నిద్ర.

(8) శబ్దప్రాదుర్భావ వచనము: ఉదా. ఇతిహరి = హరియను శబ్దము. వైష్ణవ గృహమున 'ఇతిహరి' వర్తించుచున్నది = హరి! హరి! యను శబ్దము వినబడుచున్నది.

(9) పశ్చాద్వచనము. ఉదా: అనువిష్ణు (తె. - వు) = విష్ణునివెంబడి.

(10) యథార్థవచనము: 'యథా' అను నవ్యయమునకు నాలుగర్థములు గలవు. అవి యీ యుదాహరణములవలన స్పష్టము లగును. ఉదా. (1) అను