పుట:Andhra bhasha charitramu part 1.pdf/742

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శబ్దమునకు లేదు. కావున వానిసమాసము 'రాజభార్య:' అనియై తెనుగున రాజభార్యుడు అను సమాసము కలుగదు; సంస్కృతమున 'రాజభార్యా' అని సమాసము సిద్ధించి, తెనుగున దుది దీర్ఘాచ్చునకు హ్రస్వము కలుగుటచే 'రాజభార్య' యనియగును. అట్లే, స్త్రీ ప్రత్యయములు చేరుటవలన నేర్పడిన స్త్రీ ప్రత్యయాంతములు కాని పదములందు సంస్కృతసమాసమున దీర్ఘాచ్చునకు హ్రస్వముకలుగదు. అతి + లక్ష్మి:, అతి + శ్రీ:, అనువానియందు లక్ష్మీ:, శ్రీ:, అనుపదములు స్త్రీ ప్రత్యయములు చేరుటవలన స్త్రీలింగములయినవికావు; స్వతసిద్ధముగ నే యవి స్త్రీలింగములు; కాబట్టి సంస్కృతమున వాని సమాసములు 'అతిలక్ష్మీ:' 'అతిశ్రీ:' అనికావు తెనుగున తత్సమములగునప్పుడు అతడతిలక్ష్మీ:, 'అతడతిశ్రీ' యనియగును; కాని, యిట్టి రూపములు తెనుగున గానరావు.

అదంతమయిన అవ్యయీభావము తుది సుప్ప్రత్యయము లోపింపదు; కాని, పంచమీ ప్రత్యయమయినదప్ప నా సుప్పునకు 'అమ్‌' అని యాదేశమగును. ఉదా. అపదిశమ్, తెనుగు. అపదిశము. ఇచట 'దిశయో:మధ్యే' (రెండు దిశలకు మధ్యమందు) అని విగ్రహము; ఇందు దిశాశబ్దము సమాసమున రెండవపదమగుచు నుపసర్జన సంజ్ఞను బొందుచున్నది. కావున, 'నిష్కౌశాంబి:' యని సంస్కృత సమాసమయినట్లే నిదియును 'అపదిశయో:' అని కావలసెను. కాని, యీ సూత్రము ప్రకారము సప్తమీ ద్వివచన ప్రత్యయమగు 'ఓస్‌' స్థానమున 'అమ్‌' చేరి 'అపదిశమ్‌' అని సమాసమేర్పడినది. అదంతమయిన యవ్యయీభావసమాసములందనుటవలన 'అధిహరి' మొదలగువానియందు అమాదేశము కలుగదు. పంచమీవ్యతిరిక్త విభక్తుల కనుటచేత 'ఉపకుంభానయ' అనియే అనవలెనుగాని 'ఉపకుంభమానయ' అని సంస్కృతమున ననగూడదు.

తృతీయాసప్తమీ విభక్త్యంతములగు పదములకు అమాదేశము బహుళముగా నగును. 'అప + దిశా' అను పదములకు ప్రథమా, ద్వితీయా, చతుర్థీ, పంచమీ, షష్ఠీ, విభక్తులందు 'అపదిశమ్‌' అనియు, తృతీయయందు 'అపదిశం, అపదిశేన' అనియు, సప్తమియందు 'అపదిశం, అపదిశే' అనియు సమాసములు సంస్కృతమున సిద్ధించును. తెనుగున నీ రూపముల కన్నిటికి 'అపదిశముగన్‌' 'అపదిశమున' 'అపదిశము' అనురూపములు గలుగును. అవ్యయీభావ సమాసమునకు 'సమృద్ధి' యనునర్థము గలుగునప్పుడు, సమాసమునందు నదీవాచకపదములు చేరినప్పుడును, సమాసమందలి యొకపదము సంఖ్యావాచక మయినప్పుడును, అమాదేశము నిత్యము: ఉదా. సుమద్రము