పుట:Andhra bhasha charitramu part 1.pdf/741

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాణిని సూత్రములందు ప్రథమా విభక్త్యంతముగ చూపబడినది. సమాసమందు ఉపసర్జనమను సంకేతమును పొందును. ఉపసర్జనత్వమును పొందు పదము సమాసమున బూర్వపదముగా బ్రయోగింపబడును. 'శ్రిత, అతీత, గత, అత్యస్త, ప్రాప్త, ఆపన్న, అను పదములతో ద్వితీయచేరి సమాసమగును' అను సూత్రమున 'ద్వితీయ' అనునది ప్రథమాంతముగా నిరూపింప బడినది. కాబట్టి, ద్వితీయా విభక్త్యంత పదములు శ్రిత, అతీత, గత, అత్యస్త, ప్రాప్త, ఆపన్న, అనుపదములతో, గూడునప్పుడు ఉపసర్జనమగును. 'కష్టమును + శ్రితుడు' అను విగ్రహమున 'కష్టమును' అనునది ద్వితీయాంతముగా నున్నది. కావున నది యుపసర్జనము. అది సమాసమున బూర్వపదమగును; అప్పుడు దాని విభక్తిప్రత్యయము లోపింపగా నది ప్రాతిపదికరూపమును బొంది 'కష్ట' అగును; రెండు పదములును సమసించి 'కష్టశ్రితుడు' అను రూప మేర్పడును.

సమసించు పదములలో నొకదాని విభక్తిప్రత్యయము విగ్రహమునందు మాఱక, రెండవదాని విభక్తి మాఱుచుండినచో, విభక్తిప్రత్యయము మాఱని సుబంతపదమునకును ఉపసర్జనమనియే సంకేతము. కాని, యీ యుపసర్జనత్వము నొందిన పదము సమాసమున బూర్వపదముగా నుండ నక్కఱలేదు. ఉదా. కౌశాంబినుండి నిష్క్రాంతుడు=నిష్కౌశాంబి; కౌశాంబినుండి నిష్క్రాంతుని=నిష్కౌశాంబిని; కౌశాంబినుండి నిష్క్రాంతునితో=నిష్కౌశాంబితో; కౌశాంబినుండి నిష్క్రాంతునికొఱకు=నిష్కౌశాంబికొఱకు; కౌశాంబినుండి నిష్క్రాంతునియందు=నిష్కౌశాంబియందు. ఈ యుదాహరణమున 'కౌశాంబినుండి' యను సుబంతము మాఱకుండిననే యది యపసర్జనమగును; లేకున్న గాదు రాజుయొక్క కుమారి = రాజకుమారి; రాజుయొక్క కుమారిని = రాజకుమారిని; రాజుయొక్క కుమారివలన = రాజకుమారివలన - ఈ యుదాహరణమునందు కుమారీశబ్దముపై విభక్తి ప్రత్యయము మాఱుచుండుటచే నా పదమున కుపసర్జనత్వము కలుగదు.

సమాసమందలి రెండవపదము 'గో' శబ్దమయికాని, స్త్రీ ప్రత్యయాంతమయికాని యున్నయెడల నాపదముల తుది దీర్ఘాచ్చునకు హ్రస్వము కలుగును: ఉదా. చిత్రయైనగోవు = చిత్రగువు; శబలయైనగోవు = శబలగువు.(ఇట్టి రూపములు తెనుగువాఙ్మయమున మృగ్యములు.) ని; + కౌశాంబి = నిష్కౌశాంబి; అతి + ఖట్వా = అతిఖట్వా; తెనుగున. (ఉత్వము) + డుజ్జు = అతిఖట్వుడు. అతి + మాలా = అతిమాలా; తెనుగున: (ఉత్వము) + డుజ్జు = అతిమాలుడు. అట్టిపద ముపసర్జనము కాకున్న నీ కార్యము కలుగదు. 'రాజ్ఞ: భార్యా' అను విగ్రహమున రాజన్ శబ్దమున కుపసర్జనత్వ కలదుగాని భార్యా