పుట:Andhra bhasha charitramu part 1.pdf/736

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నందితిమ్మన్న.

మ. జలజాతాసనవాసవాదిసురపూజాభాజనంబై తన
    ర్చులతాంతాయుధుకన్నతండ్రిశిర మచ్చోవామపాదంబునన్.
    దొలగంద్రోచె లతాంగి యట్లయగు నాథుల్నేరముల్సేయ బే
    రలుకంజెందినయట్టికాంత లుచితవ్యాపారము ల్నేర్తురే.
                      పారిజాతాపహరణము. [17. సం. 26. తె.]

పింగళ సూరన్న.

మ. తమిబూదీగెల తూగుటుయ్యెలల బంతాలాడుచుందూగు నా
    కొమరుం బ్రాయపుగబ్బిగుబ్బెతల యంఘ్రుల్చక్కగాజాగి మిం
    టిమొగంబై చనుదెంచు ఠీవిగనుగొంటే దివ్యమౌనీంద్ర నా
    కమృగీనేత్రలమీద గయ్యమునకుం గాల్దాచులాగొప్పెడున్.
                      కళాపూర్ణోదయము, ఆ. 1. [7. సం. 34. తె]

రామరాజభూషణుడు.

శా. రాజీవాక్షులనేచుపాతకివి, చంద్రా, రాజవానివు? నీ
   రాజత్వంబున జక్రముల్మనియెనో రంజిల్లి సత్సంతతుల్
   తేజంబందెనొ? డిందెనో యహిభయోద్రేకంబు, తా జెల్ల రే!
   రాజైపుట్టుట రశ్మిమాత్రఫలమే? రాజౌటదోషార్థమే?
                      వసుచరిత్ర, ఆ. 4. [21. సం. 22. తె.]

చేమకూర వేంకటకవి.

చ. శివుడిటురమ్మటంచు దయచేసినచో దలకెక్కి తుగ్రవై
   భవమున జూచుచో సడుగు బట్టితి వేమనవచ్చు నీగుణం
   బవునవు నందిన న్సిగయు నందకయున్నను గాళ్లుబట్టికొం
   దువు హరిణాంక వేళకొలదుల్గద నీ నడకల్తలంపగన్.
                     విజయవిలాసము, ఆ. 3. [8. సం. 36. తె.]

ముద్దుపళని.

గీ. తనదుమట్టెంత తానెంత తానె యింత, చేయజూచిన నేనెంత చేయరాదు
   వేలువాచిన ఱోలంత విరివియైన, ఱోలువాచిన నదియెంత మేలుగనునొ.
         రాధికాసాంత్వనము. [దీనియందు సంస్కృతపదములు లేవు.]

కంకంటి పాపరాజు.

మ. పలుతావుల్వెదచల్లు తెమ్మెరలు పైపై డాయ రేరాజు వె
    న్నెలగాయన్ మధుపాళిమ్రోయ గలకంఠీపాళికూయన్ మరు