పుట:Andhra bhasha charitramu part 1.pdf/737

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

    ల్లలనల్గానముచేయ నొంటి నిశివేళం దోటలో నైందవో
    పల వేదిన్వసియించు పాంథుని స్మరాపస్మారముల్సేరవే.
                    ఉత్తరరామాయణము, ఆ. 4. [17. సం. 27. తె.]

మండపాక పార్వతీశ్వరకవి.

ఉ. వ్రాయడు లెక్క లొక్కటిగ రంగడరంగ మెఱుంగుపూతలన్.
   బూయడు భిత్తిభాగముల ముఖ్యవిధానములందు మందతం
   బాయడు బాంధవాదు లగువారికి జేయగలట్టి సత్కృతుల్
   చేయడు వేఱె మీకిపుడు చెప్పగనేటికి మీరెఱుంగరే.
                     రాధాకృష్ణసంవాదము. ఆ. 2. [8. సం. 38. తె.]

పై యుదాహరణములవలన జాలమట్టుకు సంస్కృత సమేతరపదములు సంస్కృతసమములకంటె నెక్కుడుగ నున్నవని తెలియగలదు. ఆయా పద్యములు కవీశ్వరుల రచనకు ముఖ్యోదాహరణములుగ నెంచవచ్చు నని తలంచెదను. ప్రతిగ్రంథమును దీసికొని లెక్కించినను బైవిషయము స్థిరపడునని నానిశ్చయాభిప్రాయము. ఈ లెక్కించుటలో బదములే కాకప్రత్యయములును లెక్కలోనికి రావలసినదే కాక యాయాప్రత్యయములును బదములును నెన్నిసార్లుపుయోగించిన నన్నిసారులు లెక్కింపవలయును. ఇతరభాషాపదములును నట్టులే లెక్కింపబడినచో దప్పక దేశ్యపదసంఖ్య చాలహెచ్చుగ నుండు ననుటకు సందేహము లేదు. ఇదిగాక రసపుష్టి గలకావ్యములం దెల్ల దేశ్యపదము లెక్కుడుగ నుండును. పదాడంబరము కొఱకును, బాండిత్య ప్రకర్షకొఱకును నన్యదేశ్యపదపూర్ణములుగ గావ్యముల నొనరించినచో రసమును, అర్థగాంభీర్యమును గొంత చెడకపోదు. నిత్యమును మనజిహ్వాగ్రమున నుండుమాటలు మనకు సుబోధములుగా నుండు ననుట వేఱ చెప్ప