పుట:Andhra bhasha charitramu part 1.pdf/735

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

    బెట్టు రచించి తీవు ఋషివె ట్టయి తొక్కదినంబుమాత్రలో
    బొట్టకు లేక తిట్టెదవు పుణ్యగుణంబులరాశి గాశికన్.
                    కాశీఖండము. [12. సం. 25. తె.]

బమ్మెరపోతరాజు.

శా. ఏరా దక్ష యదక్షమానస వృథా యీ దూషణం బేలరా
    యోరీ పాపము లెల్లబో విడువురాయుగ్రాక్షు జేపట్టురా
    వైరం బొప్పదురా శివుం దలపురా వర్ణింపురా రాజితోం
    కారాత్ముం డగునీలకంఠు దెగడంగారాదురా దుర్మతీ.
                    వీరభద్రవిజయము, అ. 1.[15. సం. 25. తె.]

పిల్లలమఱ్ఱి పినవీరన్న.

ఉ. కాకనెదిర్చి సంగరముఖమ్మున హెచ్చిన రాజవంశమున్
   గూకటివేళ్లతో బెఱికి గోత్రవధంబును జేసి నట్టి యా
   వ్రేకపుగీడుగాక ప్రజనేచదలంచిన గోరుచుట్టుపై
   రోకటిపోటుచందముగ రోసి జను ల్ననుజూచి తిట్టరే.
                    జైమినిభారతము. [8. సం. 31 తె.]

కృష్ణదేవరాయలు.

సీ. వాతెఱతొంటికైవడి మాటలాడుదు కుటిలవృత్తి వహించె గుంతలంబు
   లక్షులు సిరులురా నరచూడ్కిగనుగొనె, నాడించె బొమగొనియాననంబు
   ననుగొమల్నెగయ వక్షముపేక్ష గడకొత్తె బాణిపాదము లెఱ్ఱివాఱదొడగె
   సారెకుమధ్యంబు దారిద్ర్యములెచెప్పె ఱొచ్చోర్వకిటులోగ బొచ్చెమేను

గీ. వట్టిగాంభీర్యమొక్కడు పెట్టుకొనియె, నాభినానాటికీగతి నాటిపొందు
   చవుక యైనట్టి యిచ్చట చనదునిలువ, ననుచుజాఱినకరణి బాల్యంబుజాఱె
                     ఆముక్తమాల్యద, ఆ. 5. [16. సం. 54. తె.]

అల్లసాని పెద్దన్న.

ఉ. ఎంతదపంబుచేసి జనియించినవారొకొ మర్త్యభామినుల్
   కాంతుడవజ్ఞ చేసినను గాయముబాయుదు రే నమర్త్యనై
   చింతలవంతలంజివికి సిగ్గరితిన్ మృతిలేని నాదు చె
   ల్వింతయు శూన్యగేహమున కెత్తినదీపిక యయ్యె నక్కటా.
                    మనుచరిత్ర. ఆ. 3. [14. సం. 27. తె.]