పుట:Andhra bhasha charitramu part 1.pdf/734

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎఱ్ఱాప్రెగడ.

మ. తనకావించిన సృష్టి తక్కొరులచేతంగాదు నా నే ముఖం
    బున దాబల్కినపల్కు లాగమములై పొల్పొందు నావాణి న
    త్తనునీతం డొకరుండునా జనుమహత్త్వాప్తిం గవిబ్రహ్మనా
    వినుతింతుం గవితిక్కయజ్వనఖిలోర్వీ దేవతాభ్యర్చితున్.
                         హరివంశము. [16 సం. 30 తె.]

మంత్రిభాస్కరుడు.

ఉ. ఈ కొఱగాని కార్య మిటు లెవ్వడొకో యనుకూలశత్రుడై
   నీకు బ్రియంబుగా బలికె నీవును నిత్తెఱ గాచరింపగా
   రాక తలంచిచూడ నిదిరాక్షసవంశవినాశ కాలమో
   కా కటుగాన నీకొనునె కాదనకీదృశ మెవ్వ డేనియున్.
                   రామాయణము. అర. ఆ. 2. [8 సం. 36 తె.]

మారన.

ఉ. ఎక్కడనుండివచ్చె నత డీతుహినాద్రికి వేడ్కనూని యే
   నక్కట యక్కునూరు రుచిరాకృతి యాదట నేల చూచితిన్.
   మక్కువ నేల నాదుమది మన్మథు డేచదొడంగె నా కయో
   దిక్కిక నెవ్వరిచ్చట మదీయు లటంచు దురాశ యేటికిన్.
                మార్కండేయపురాణము. ఆ. 5. [10 సం. 31 తె.]

నాచనసోముడు.

చ. తిరిసినకూడుతెచ్చి నలుదిక్కులబోడలు తిండివెట్టగా
   బెరిగినపొట్టతోడ నొక పెంటపయిం దొరవోలె నెవ్వరిన్
   సరకుగొనండు పట్టుకొని చాగఱగొన్న బలే యెఱుంగు డ
   క్కరిబలుమోపుమోచు నయగారితనం బిరువుట్టి గట్టినన్.

చ. పెఱిగితిగాక నీవు నొకప్రెగ్గడవే సభ లుండుభంగి ము
   న్నెఱుగనివాడవై బ్రమసి యెవ్వరిముందఱ నేమిమాటలో
   యఱచిరి వారిజంకెలకు నంతట ద్రోపడి వచ్చి తిచ్చటన్
   గఱువగవచ్చునే బలిమి గాడిదకుం బులితోలు గప్పినన్.
                     హరివంశము. [సం. 5. 68. తె.]

శ్రీనాథుడు.

ఉ. ఎట్టు పురాణము ల్పదియు నెన్మిది జెప్పితి వెట్టువేదముల్
   గట్టితి వేర్పఱించి నుడికారము సొంపెనలార భారతం