పుట:Andhra bhasha charitramu part 1.pdf/729

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


10. కొంకల్లు (మడకశిరా తాలూకా): హండే హనుమప్పనాయునికి రామరాయలు తిరుమలరాయలు ఇచ్చిన గ్రామములో నొక్కటగు కణికల్లు ఇదే కావచ్చును. శాసనములోని కణెయకల్లు ఇదే యగునేమో.

11. ధర్మవరము: కన్నడభారతములో పంపని తండ్రికి ఒక ధర్మవరము అగ్రహారముగా నిచ్చినట్లున్నది. బచ్చెసాసిరములో నిదియున్నట్లు చెప్పబడినది. ఇతర అగ్రహారములగు వసంత, కొట్టూరు, నిడుగుంది, విక్రమపురము, గుర్తింపబడినచో నిది నిజమగును.

12. జూటూరు (తాడిపత్రి తాలూకా): 'జూటూరు సమరనిర్వాహకు' డని రామరాయనికి బిరుదమున్నది. అక్కడ ఒక యుద్ధము జరిగియుండ వలయును.

13. రామగిరి (ధర్మవరము తాలూకా): 'రామగిరిదుర్గ ప్రతిష్ఠాపకు'డని "రామరాయవిజయము"లో రామరాయనికి విశేషణమున్నది.