పుట:Andhra bhasha charitramu part 1.pdf/708

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. కొండగాలి అకరాబు జమ్నాకొచ్చాకు - South-East by East.

13. కొండగాలి అకరాబు - South-East - ఆగ్నేయము.

14. కొండగాలి అకరాబు డావుకొచ్చాకు - South-East bya South.

15. సోలీడావుతీరు - South-South-East.

16. సోలీడావుకొచ్చాకు - South by East.

17. సోలీ - South - దక్షిణము.

18. సోలీ - జమ్నాకొచ్చాకు - South by West.

19. సోలీ జమ్నాతీరు - South-South-West.

20. కచ్చం అకరాబు డావుకొచ్చాకు - South-West bya South.

21. కచ్చం అకరాబు - South-West - నైఋతి.

22. కచ్చం అకరాబు జమ్నాకొచ్చాకు - South-West by West.

23. కిఫలయి జమ్నాతీరు - West-South-West.

24. కిఫలయి జమ్నాకొచ్చాకు - West by South.

25. కిఫలయి - West - పడమర.

26. కిఫలయి డావుకొచ్చాకు - West by North.

27. కిఫలయి డావుతీరు - West-North-West.

28. ముఠాకోడు అకరాబు జమ్నాకొచ్చాకు - North-West by West.

29. మఠాకోడు అకరాబు - North-West - వాయవ్యము.

30. ముఠాకోడు అకరాబు డావుకొచ్చాకు - North-West by North.

31. గాయి జమ్నాతీరు - North-North-West.

32. గాయి జమ్నాకొచ్చాకు - North by West.

పై పేళ్లలో 'డావు' అనునది 'కుడిప్రక్క' అనియు, 'జమ్నా' అనియు 'ఎడమప్రక్క' అనియు తెలుసుకొనవలెను. ఇట్లే 'కాకస్‌'నుకూడ తెలుపవలెననిన ముఖ్యదిక్కులు, కొచ్చాకులు, తీరులు, అకరాబులు, వీనికి జమ్నా, డావుల భేదమును కల్పించియు, 'కాకాకస్‌' లను తెలుపుటకు పై వానికి 'కాకస్‌' లు కలిపి వానికి జమ్నా, డావుభేదములను కల్పించియు పేళ్లు చెప్పవలెను.

సమకాపెట్టె - Binacle - సమకా ఉండు పెట్టె. దీనిలో చిన్నముల్లు ఉండును. ఆ ముల్లుమీద అట్ట ఆటంకములేకుండ తిరుగును.

సమప్రక్కగా పోవుట - Abreast - రెండు ఓడలు ఒకదానిప్రక్కగా ఒకటి వెళ్లుట.