పుట:Andhra bhasha charitramu part 1.pdf/709

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సముద్దరిబోము - Bumkin - చూ. కలిమి పరమాను.

సవద్దరిబోము - Bowsprit - అనిమి వద్దనుండు దూలము.

సరంగు - Commander - ఓడయజమాని. ఇతనికి ఓడ నడిపించుటతో ఏమియు ప్రసక్తిలేదు. ఆ విషయమై ఇతడు జోక్యము కలుగ జేసికోకూడదు. అది అంతయు మాలీముపని. సరంగుపని హార్బరులో ఉన్నప్పుడు సరుకు వేయించుట, దింపించుట, వ్యవహారము చేయుట మాత్రమే.

సవాయి - Mouse - చూ. మాతు.

సవాయిత్రాళ్లు - Shrouds - కొయ్యలకొసలనుండి ఓడకు రెండు ప్రక్కలకును కట్టిఉన్న పెద్దత్రాళ్లు. ఇవి కొయ్యలు కదలకుండ చేయుటయే కాకుండ, పెద్దచాపలు పరచుటకు కూడ పనికివచ్చును.

సవాయిజీబీ - జీబీలలో ఒకభేదము. చూ. జీబీ.

సాగలా - Fake - అమారుత్రాడుచుట్ట.

సికార్ బరాస్ - అంతకంటె గాలిలోనికి వెళ్లడమునకు అవకాశములేని స్థితి.

సిందీచెక్క - Gunnel or gunwale - ఓడప్రక్కయొక్క మీది అంచు.

సీకువేయుట - To reeve - త్రాటిని కన్నములోనుంచి దూర్చుట.

సుత్తి - Maul - పెద్ద ఇనుపసమ్మెట.

సుబురుకేళీ: కఱ్ఱలు, తిరిగి, ఈ అడ్డగీతలమీద పొడవుగా ఒకకఱ్ఱనువేసి, క్రింది పొడవుకఱ్ఱ నీ మీదిదానినే బిగింతురు. మీదిపొడవుకఱ్ఱకు సుబురు అని పేరు.

సురదాని - Caboose - ఓడలోని వంటగది.

సులువు - చాపలును పరమానులును గల ఒంటికొయ్య ఓడ.

సూరిచెక్క - Gunnel or gunwale - చూ. సిందీచెక్క.

సైతాన్‌జీబీ - చూ. బోమ్‌జీబీ.

సైను - Beacon - చూ. కోడేకొయ్య.

సోలీ - South - దక్షిణదిశ. చూ. సమకా.

సోలీ జమ్నాకొచ్చాకు - South by West - సోలీకి ఎడమవైపు 360 డిగ్రీలలో 1/32 వంతు డిగ్రీలుగా ఉన్న దిక్కు.

సోలీ జమ్నాతీరు - South-South-West - దక్షిణమునకును నైఋతికిన్ని సరిగా మధ్యనుండు దిక్కు.