పుట:Andhra bhasha charitramu part 1.pdf/707

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కును మధ్యభాగము అరలుగను (halves) పావులుగను భాగింతురు. సర్కమ్ఫరెన్సు అంతయు 360 డిగ్రీలుగా భాగింపబడి ఉండును గనుక రెండురూముల మధ్యను ఏర్పడిన కోణము 11 డిగ్రీల 15 మినిట్లు కొలతకలిగి ఉండును. ముఖ్యదిశలు నాలుగు: ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర. వీనిలో రెండేసింటికి మధ్యగా మరినాలుగు దిక్కులు ఏర్పడును: ఈశాన్యము, ఆగ్నేయము, నైఋతి, వాయవ్యము. ఈ యెనిమిది దిక్కులే అష్టదిక్కు లను పేర వ్యవహరింపబడుచున్నవి. ఇంగ్లీషులో పైనిచెప్పిన 32 రూములకును పేళ్లున్నవి. తెనుగులోగూడ ఆ పేళ్లకు సరియైనమాటలు ఉండుటయే కాకుండ, ఇంకను చిన్నభాగములకును పేళ్లు కలవు. ఈ పేళ్లన్నిటిని అరబ్బులనుండి మనవారు ఎరువు తెచ్చుకొన్నట్లు కనిపించును. రెండు ముఖ్యదిక్కులకు సరిగా మధ్యనుందు భాగమునకు 'అకరాబు' అని పేరు. ఒక అకరాబుకును దాని తరువాతి ముఖ్యదిక్కుకును సరిగా మధ్యనున్న దిక్కుకు 'తీరు' అని పేరు. ఒక తీరుకు దాని తరువాతి అకరాబుకుగాని, ముఖ్యదిక్కుకుగాని సరిగా మధ్యనున్న దిక్కుకు 'కొచ్చాకు' అనిపేరు. ఇంతటితో 32 భాగములైనవి. తెనుగుఓడలలోకూడ ఈ భాగములతోడనే కాలక్షేపము చేయుదురు. కాని యింకను చిన్నభాగములు చేయవలసివచ్చినప్పుడు, కొచ్చాకులో సగమునకు 'కాకస్‌' అనియు, కాకస్‌లో సగమునకు 'కాకాకస్‌' అనియు సంజ్ఞలు కలవు. వీనిప్రకారము సమకా మీద 128 భాగములు ఏర్పడును. అందుచేత 'కాకస్‌' అనునది అరపోయంటుకును, 'కాకాకస్‌' అనునది పావుపోయంటుకును సమమవును.

దిక్కులపేళ్లు:-

1. గాయి - North - ఉత్తరము.

2. గాయిడావుకొచ్చాకు - North by East.

3. గాయిడావుతీరు - North-North-East.

4. తూర్పు అకరాబు జమ్నాకొచ్చాకు - North-East by North.

5. తూర్పు అకరాబు - North-East - ఈశాన్యము.

6. తూర్పు అకరాబు డావుకొచ్చాకు - North-East by East.

7. మతలయి జమ్నాతీరు - East-North-East.

8. మతలయి జమ్నాకొచ్చాకు - East by North.

9. మతలయి - East - తూర్పు.

10. మతలయి డావుకొచ్చాకు - East by South.

11. మతలయి డావుతీరు - East-South-East.