పుట:Andhra bhasha charitramu part 1.pdf/703

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోము - Boom - జీబీలు తగిలించు పెద్దకఱ్ఱ.

బోమ్‌జీబీ; లేక సైతాన్ జీబీ - జీబీలలో ఒకభేదము.

బోయా - Buoy - ఇది ఒక పెద్దసీసా, లేక, కఱ్ఱదుక్క, దీనిని లంగరుకు కట్టుదురు. దీనిస్థానమునుబట్టి లంగరు నీటిలో ఎక్కడ ఉన్నదో తెలియును.

భూమితాకుట - To get stranded - నేలకు ఓడ తగిలి కదలకపోవుట.

మతలయి - East - తూర్పుదిశ. చూ. సమకా.

మతలయి - జమ్నా - కొచ్చాకు - East by North - మతలయికి ఎడమవైపు 360 డిగ్రీలలో 1/32 వంతు డిగ్రీలుగా ఉన్నదిక్కు. చూ. సమకా.

మతలయి - జమ్నా - తీరు - East-North-East - తూర్పు ఈశాన్యములకు సరిగా మధ్యనున్నదిక్కు. చూ. సమకా.

మతలయి - డావు - కొచ్చాకు - East by South - మతలయికి కుడివైపు 360 డిగ్రీలలో 1/32 వంతు డిగ్రీలుగా ఉన్నదిక్కు. చూ. సమకా.

మతలయి - డావు - తీరు - East-South-East - తూర్పుకును ఆగ్నేయమునకును సరిగా మధ్యనుండుదిక్కు. చూ. సమకా.

మనవరి - Man-of-war - తెరచాపలును, పరమానులును గల మూడు కొయ్యల ఓడ.

మరిమినీరు - Bilge water - ఓడు అడుగుభాగము బల్లపఱపుగా ఉండుటచేత బొంబాలోనికి వెళ్లకుండ నిలిచిపోయిన నీరు.

మసాలాకట్టుట - Siesing - రెండుత్రాళ్లనుగాని, ఒకటేత్రాటిలోనిభాగములనుగాని దారముతో కలిపి కట్టుట.

మాకు - Stem - అనిమిదగ్గఱ రెండుబోడిదలను కలుపుటకు ఉంచిన గుండ్రనిబల్ల. దీనిక్రిందికొనకు ఏరువా చేర్చబడును. మీదికొనమీద అనిమికొయ్య నిలుచును.

మాతు - Mouse - కొయ్యలను పట్టిఉంచు త్రాళ్లకొనలను ఉండు చిన్నబంతి లేక గుండు. చూ. నవాయి.

మాలీ - Shank painter - లంగరు ఎత్తివేసిన తరువాత దండీని, పన్నులను మీదికి ఎత్తిఉంచు చిన్నత్రాడు.

మాలీము - Pilot - ఓడను నడిపించు అధికారి. ఓడ సబురులో ఉన్నంతవఱకు ఓడలోనివారందఱు నితనికిలోబడి పనిచేయవలెను. ఇతడు