పుట:Andhra bhasha charitramu part 1.pdf/704

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లెక్కలుచేసియు, పరీక్షచేసియు, చార్టులుచూచియు, ఓడయొక్క, --జ్ఞు, తూలు, కాలము, స్థానము, మొదలయినవానిని కనుగొనుచు నీ ముజరామీద నడిపించవలెనో చెప్పును.

మిసింజరు - Mesenger - లంగరు ఎత్తునప్పుడు దబరాసత్తువ అమారుకు చేరునట్టు చేయుత్రాడు. చూ. యారీ.

ముక్కులు - Davit - లంగరు ఓడప్రక్కలకు తగలకుండ మీదికి ఎత్తుటకు ఉపయోగించు పొడుగు కఱ్ఱ.

ముజరా - A point of the compass - కంపస్సు లేక సమకా మీద చూపబడిన ఒక దిక్కు.

ముజరామీదికి తెచ్చుకోవడము - To right the helm - జమ్నా బోడిదకో, డావుబోడిదకో, ఓడను త్రిప్పిన తరువాత చుక్కాణిని సర్దుకొనుట.

ముఠాకోడు-అకరాబు - North-West - వాయవ్య.

ముఠాకోడు-అకరాబు-జమ్నా-కొచ్చాకు - North-West by West - ముఠాకోడు అకరాబుకు ఎడమవైపు 360 డిగ్రీలలో 1/32 వంతు డిగ్రీలుగా ఉండు దిక్కు. చూ. సమకా.

ముఠాకోడు-అకరాబు-డావు-కొచ్చాకు - North-West by North -ముఠాకోడు అకరాబుకు కుడివైపు 360 డిగ్రీలలో 1/32 వంతు డిగ్రీలుగా ఉండు దిక్కు. చూ. సమకా.

ముత్తాములు - Dead-eyes - చాపలను కట్టు కఱ్ఱలు పోవుటకు మూడేసి బెజ్జములు గల కఱ్ఱ దిమ్మలు.

మేబోడిద - Windward - గాలి వీచువైపుకాక రెండవవైపు ఉన్న ప్రక్క. చూ. జేరుబోడిద.

మొక్కులు - Bitts - చిన్నపిలోతులు. చూ. పిలోతులు.

మోజా - Spray - చూ. ఓటు.

యారీ - Messenger - చూ. మిసింజరు.

రంబ్రాలు - Rat-lines - తట్టుదగ్గఱనుండి చాపలకు అడ్డుగా సమాన దూరములో కొయ్యల కొసలవఱకును పోవుత్రాళ్లు - ఇవి నిచ్చెనవలె ఉపయోగించి కొయ్యల కొసలవఱకు నెక్కుటకు పనికివచ్చును.

రింగినీ - Rigging - ఓడ కొయ్యలకును, చాపలకును తగిలించియున్న త్రాళ్ల కన్నిటికిని ఇది పేరు.

రింగినీ చేయుట - To rig - ఓడ త్రాళ్ల నన్నిటిని ఎత్తి ఉంచుట.