పుట:Andhra bhasha charitramu part 1.pdf/702

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బావుటా - Ensign - జెండా. ఇట్టి బావుటాలు అనేకము లుండును. దూఅరముగా ఉన్న ఓడలకు రంగులబావుటాలతో సంజ్ఞలు చేయుదురు. ఇదిగాక అన్ని ఓడలకును అది యే దేశపుదో తెలియజేయు బావుటా ఉండును.

బిగిలు ఊదుట - Call onthe bugle - బూరాఊదుట.

బుడిదీబొక్కలు - Scuppers - ఓడతట్టుమీదచేరిన నీరు మరల సముద్రములోనికి పోవుటకు ఏర్పఱచిన బొక్కలు - వీనికి సీసపురేకు అమర్చుదురు.

బుడిదీవేయుట - To sound - సీసపుముక్కను నీటిలో వదలి లోతు కనుగొనుట.

బురమాబొత్తా - Apron - ఫిరంగిగంతలద్వారా నీరు తట్టుమీదికి రాకుండవేసిన సీసపుముక్క.

బూరా - Bugle - బిగిలు.

బెజ్జము - Leak - కన్నము.

బెజ్జము కోయడము - Scuttling - ఓడను ముంచివేయుటకుగాని ఇసుకలో దిగబడినప్పుడు దానిలోని సరుకు వేగముగా దింపుటకుగాని తండా అడుగునను, ఓడప్రక్కలను, పెద్దకన్నములు చేయుట.

బైసాపడుట - Aback - గాలి ఒత్తిడిచేత చాపలు కొయ్యలకు అంటుకొనిపోవుట.

బైసాపడకపోవుట - To miss stags - గాలిమార్గముగా అనిమి నడవకపోవుట.

బొణియాపోరీ - Dog watch - నావమార్గమును కనిపెట్టుచు నేల కనబడినను అపాయము రానున్నను తెలియజేయువాడు. వీడు తనస్థానమును వదలకూడదు. అట్లు కనిపెట్టుచుండువారిలో రాత్రి పండ్రెండుగంటలనుండి మధ్యాహ్నము పండ్రెండు గంటలవరకు నుండువాడు బొణియాపోరి. చూ. నందపోరి.

బొంబా - Pipe - తండాలోని నీటిని పైకిపంపించు గొట్టము. దీనిలో రెండుగొట్టము లుండును. దూద్‌పాలు అనుగొట్టము నీటిని మీదికి లాగగా, లాడ్‌పాలు పైకి పంపించును.

బొంబాపట్టుట - Bale - తండాలోని నీటిని పైకి తోడివేయుట.

బోడిద - Board - ఓడప్రక్క - జమ్నాబోడిద - ఎడమప్రక్క - డావుబోడిద = కుడిప్రక్క.