పుట:Andhra bhasha charitramu part 1.pdf/700

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్లమునకు వెళ్లుట - To observe the offing - సముద్రముమీద నీరు ఆకాశము కలిసియున్న స్థలమును చూచుట.

పాతఓడ - Hulk - సబురుకు మరి పనికిరాక ఒకమూల పడివేసిన ఓడ.

పాతబడుట - Broken backed - ప్రాతదయిగాని, ప్రమాదము వల్లగాని అల్లలాడుచు అనిమి అమరాలు క్రుంగిపోవుట.

పాలకాయలు - Hatches - కుతిలీమీద ఉన్న తలుపులు.

పాలకాయ బద్దెలు - Batten - పొడుగుపాటి సన్నని కఱ్ఱబద్ద. వీనిని పాలకాయలమీద తాపుదురు.

పాలకాయలకు బద్దెలువేయుట - To Batten down the hatches - పాలకాయలమీద బద్దెలువేసి బిగించుట.

పావుడాయలు - Marling spike - త్రాళ్ల పురివిప్పుటకు ఇనుముతో గాని కఱ్ఱతోగాని చేసిన గుండుసూది.

పావిడోలు - Fid - చూ. చారుకట్లు.

పిలోతులు - Rullocks, bitts - తెడ్లు వేయుచున్నప్పుడు వానిని ఉంచుటకు ఓడప్రక్కలను ఉండు కన్నములు - చిన్న పిలోతులకు 'ముక్కులు' అని పేరు - చూ. ముక్కులు.

పురాలుకట్టుట, - చుట్టుట, - వేయుట, - Keekling, rounding, serving - త్రాటికిరాపిడి హెచ్చుగా తగులకుండ దానిచుట్టును ట్వైను చుట్టుట.

పూటుతక్కువ ఓడ - Crank - బరువుచాలక నీటిమీద ఎక్కువగా తేలిఉన్న ఓడ.

పెద్దకొయ్య - నాలుకొయ్యల ఓడలో అమరమునుండి రెండవ కొయ్య - Mainmast.

పెద్ద తండేలు - Chief Commander in a ship - నావమీది అందఱిమీదను అధికారి.

పేటీలాను - Gasket - చాప ఎత్తినతరువాత కదలకుండ దాని చుట్టును వేసినత్రాడు.

పేటీవేయుట - To furl - చాప ఎత్తి పేటీలాను కట్టుట.

పొడువు - Fore-and-aft- అనిమి అమరాలప్రక్కగా ఉన్న ఓడకొలత.

పొంతా(లు) - Bend - లంగరుకుగాని, మరిఒక త్రాడుకుగాని కట్టి ఉన్న త్రాడుకొన.