పుట:Andhra bhasha charitramu part 1.pdf/701

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పొంతాలు ముడితీయుట - To bend - పొంతాలువద్దనున్న ముడిని విప్పుట

పొన్నా - Fore-castle - అనిమివద్ద తట్టుకుపైగా ఏర్పరచిన మరి ఒక ఎత్తుతట్టు - ఇచ్చట ఒకగది (birth) ఉండును. దీనిలో కళానులు నిద్రపోదురు.

పొర్లుట - To labour - సముద్రము అల్లలల్లోలముగా నున్నప్పుడు ఓడ ఇటునటు, పడుచు కొయ్యలకును, క్రిందిభాగమునకును కూడ అపాయము కలిగు స్థితిలో ఉండుట. చూ. రోలుమోపు అగుట.

పోటు - Flow tide. సముద్రముపొంగి హెచ్చుపదునుగా ఉన్నస్థితి. చూ. హెచ్చు పదును.

ఫిరంగిగంతలు - 1. Gratings - తండులోని క్రిందిగదులకు గాలి, వెలుతురువెళ్లుటకు పాలకాయలయొద్ద చిక్కుచాపలవలె ఉన్న కన్నములు - 2. Loop-holes -యుద్ధనావలలో ఫిరంగులు ఉంచుటకు పనికివచ్చు కన్నములు.

ఫిరాయించుట - About - ఓడ ఒకప్రక్కనుండి మఱియొకప్రక్కకు త్రిప్పుట.

బడికొయ్యలు - Bare poles - చూ. ఉత్తరకొయ్యలు.

బత్తాయిలు - Lumpers - హార్బరులో ఓడ యున్నప్పుడు సరుకు దింపుటకును లోపలవేయుటకును ఎర్పరచిన కూలీలు.

బత్తీకొయ్య - Light house. దీపస్తంభము. దీనిలోని దీపమువలన రాత్రివేళ ఓడ ఏస్థలములో ఉన్నదియు తెలియును.

బద్దలగుట - Bilge - ఓడపలకలు విడిపోవుట.

బరానులు - Braces - తెరచాపలను గాలివైపుకు త్రిప్పుటకు ఉపయోగించు త్రాళ్లు.

బరాసులాగు - To brace to - గాలివైపులేని చాపలను వదలి, గాలికెదురుగా ఉన్నవానిని లాగిఉంచుట.

బాయర్ పరమాను - ఒకవిధమైన పెద్దపరమాను. చూ. పరమాను.

బార - Fathom - ఆరు అడుగుల కొలత.

బారుచేయుట - To belay - వదులుగా ఉన్నదానిని బిగువుగా ఉండునట్టు లాగుట.

బావు - Tiller - చుక్కాణిని త్రిప్పుటకు ఉపయోగించు కఱ్ఱ.