పుట:Andhra bhasha charitramu part 1.pdf/699

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దూద్‌పాలు - బొంబాలోని ఒక గొట్టము. బొంబాలోని నీటిని దూద్‌పాలు లాగుకొనగా లాడ్ పాలు పైకి పంపించివేయును.

దూరము - Aloof.

దోనె - కోనచాపగల ఒంటికొయ్య ఓడ. చూ. పడవ.

నత్తరపాడా - Grapnell, Kedge - చిన్నలంగరు - దీనికి దండీ ఉండదు. నాలుగైదు పండ్లుమాత్ర ముండును. చిన్న పడవలను కలిపి ఉంచుటకు దీనిని వాడుదురు. రూ. నత్తరపొడా. (A Kedge has a stock, but not a grapnell).

నాలుగుకొయ్యల మనపరి - A four-masted man-of-war - నాలుగు కొయ్యలును అన్నిటికిని చాపలు, పరమానులు గల మనపరి.

నిశానికొయ్య - నాలుగుకొయ్యల ఓడలో అనిమి దగ్గర ఉన్నకొయ్య.

నేజాపటాలు - Chain plates - ఓడ ప్రక్కలకు అమర్చబడిఉన్న ఇనుపరేకులు - వీనికి ముత్తాములు తగిలించబడి ఉండును.

నేరము - Ballast, Kentledge - ఓడ మిక్కిలి తేలిపోయిన, తిరుగబడిపోవును. అందుచేత అది కొంతవఱకు నీటిలో దిగి ఉండవలెను. తండాలో సరుకు వేసినచో అట్లు దిగి ఉండును. కావలసినంత సరుకు లేనప్పుడు రాళ్లు, మన్ను, ఇనుపదుక్కలు మొదలయిన బరువును తండా అడుగున పడవేయుదురు. అట్టిదానికి నేరము అని పేరు.

పక్కీ - slip - సత్తారుగా అనగా వాలుగా ఉన్ననేల.

పడవ - కోనచాపగల ఒంటికొయ్య ఓడ - చూ. దోనె.

పచ్చర్లు దిగగొట్టుట - Jamming - ఒక వస్తువును మరి రెండు వస్తువుల మధ్యను పెట్టి కదలకుండ బిగించుట.

పడకచెక్కలు - Dunnage - తండా అడుగున కన్నములుండిన నీరు వచ్చి సామాను తడిసిపోకుండ వేసిన కఱ్ఱచెక్కలు.

పన్ను - Fluke - లంగరుయొక్క వాడికొన.

పరాన్‌జీబీ - జీబీలలో ఒకభేదము - చూ. నవాయిజీబీ, సైతాన్ జీబీ, బోముజీబీ.

పరమాను - Yard - కొయ్యలకు అడ్డుగా ఎత్తినకఱ్ఱ - దీనిమీద చాపలు పఱచుదురు.

పలాను ఎత్తుట - పాతత్రాళ్లు పురివిప్పివేసి ఒక దగ్గర పడవేయుట.