పుట:Andhra bhasha charitramu part 1.pdf/695

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చెయినుబోల్తాపడుట - Elbow in the hawse - అమారు తనమీద తాను తిరుగబడి మలతలు పడుట.

ఛత్రీ - Awning, cuddy - మిక్కిలి ఎండగానున్నప్పుడు మనుష్యులకు ఎండ తగులకుండ, తట్టు ఎండచేత చెడిపోకుండ గొడుగువలె ఎత్తిన గుడ్డ.

జమ్నా = ఎడమప్రక్క - ఉదా. జమ్నా - బోడిద = ఓడకు ఎడమ ప్రక్క; గాయి - జమ్నా - తీరు = గాయికి ఎడమప్రక్కనున్న తీరు.

జమ్నా - బోడిద - Larboard - ఓడయొక్క ఎడమప్రక్క - ముఖము అనిమివైపు త్రిప్పియుండగా ఎడమవైపు ఉన్నప్రక్క - చూ. డావు - బోడిద.

జాటుకర్ర - Swab - చెడిపోయిన త్రాళ్లనన్నిటిని కుచ్చుగా కట్టి, తట్టు, కేమిరీలను బాగుచేయుటకు ఉపయోగించు చీపురు.

జీబీ - Jib - అనిమివద్దనున్న జీబీ - బోముకు తగిలించినట్టియు, ఓడలో అన్నిటికంటె ముందుగా ఉన్నటువంటియు పెద్ద తెరచాప. ఇట్టివి మూడునాలుగు ఉండును.

జీబీబోము - Jibboom - అనిమి వద్దనుంచి పైకి వ్యాపించియున్న ఒక కఱ్ఱ.

జేరు - Lee - గాలి ఏవైపు వీచుచున్నదో ఆ దిక్కు - చూ. మే (బోడిద). The ship is a - lee = నావ జేరు బోడిదగా నడుస్తున్నది. రూ. జేరా.

జేరా - Lee - రూ. జేరు.

జేరుదరి - Leeshore - గాలి ఏ వైపు వీచుచున్నదో ఆదరి.

జేరుబోడిద - Leeside of a ship - గాలి యేవైపుగా నావమీద బడుచున్నదో ఆ బోడిద లేక ప్రక్క.

టప్పు - Distance found out by the log - టప్పు - రాట్నమును బట్టి ఓడ నడచినదూరము - ఈ దూరములను లాగ్ పుస్తకములో ఎక్కించుదురు.

టప్పు - రాట్నము - Log - నావ యెంతవడిగా పోవుచున్నదో, అందు మూలముగా ఎంతదూరము నడచినదో తెలిసికొనుట కుపయోగించు ఉప్కరణము. ఇది క్వాడ్రాంటు రూపముకలిగిన ఒక బల్లముక్క దీని గుండ్రని అంచుకు సీసము అమర్చిఉంతురు. అందువలన అది నీటిలో ఇటు