పుట:Andhra bhasha charitramu part 1.pdf/694

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చడాలు కట్టుట - పురి విడిపోయిన త్రాడుకొసలు ట్వైనుతో కట్టుట.

చాటలు - Flukee - లంగరుతో వాడికొనలు (పన్నులు) మొద్దు అయిపోకుండ వానికి తగిలించిన గిన్నెలు.

చారుకట్లు - Fid 1. క్రింది కొయ్యమీద సెలకొయ్య (మీదికొయ్య) ఎత్తినప్పుడు ఆమీదికొయ్య బరువును ఆపుటకు ఏర్పరచిన కట్టె. ఇది ఒకప్పుడు ఇనుముతో కూడ చేయుదురు. దీని కొకకొనను భుజమువలె ఉండును.

2. కఱ్ఱమేకు - గట్టి కఱ్ఱముక్కను గుండుసూదిలాగు చేసి త్రాళ్లకొనల పురి విప్పుదురు. చూ. పావిడోలు.

చిక్కుతీయుట - To overhaul - చిక్కుపడిన త్రాళ్లను సరి చేయడము.

చిన్న తండేలు - One of the boat-swain - పెద్దతండేలు తరువాత అధికారి. చూ. పెద్దతండేలు, కేటు తండేలు.

చిలికీ - Rudder wheel - చిలికీ అనునది చుక్కాణిని త్రిప్పు యంత్రము. చుక్కాణి యొద్దనున్న భాగమున కంతటికిని చిలికీ అనియే అందురు.

చీడీ - Gangway - తండాలోను, తట్టు మీద కూడ మనుష్యులు వెళ్లుటకును వచ్చుటకును ఉండునట్టి మార్గము.

చుక్కబల్ల - పూర్వకాలమున క్వాడ్రాంటు, సెక్ట్సాంటు, మొదలయిన ఉపకరణములు లేనప్పుడు వానికి బదులుగా ఒక బల్లముక్కను ఉపయోగించుచుండిరి. ఈ బల్లమీద కొన్ని గీతలుగీసి, ఒక్కొక్క గీతకు ఒక్కొక్క స్థలముయొక్క పేరుపెట్టి, బల్లకు అడుగున ఒక దారముకట్టి, దారమును ఆయా గీతలమీదికి త్రిప్పుచు అర్జును (లాటిట్యూడు) కనుగొనుచుండిరి. అట్టి బల్లకు చుక్కబల్ల అనిపేరు. ఇప్పటికిని చుక్కబల్లను అక్కడక్కడ ఉపయోగించుచున్నారు.

చుక్కాణి - Rudder - ఓడను ఇటునటు త్రిప్పు యంత్రము.

చుట్ట - Life-buoy - ఎవడైన నీటిలో పడినప్పుడు ఈ చుట్టను నీటిలోనికి విసరుదురు. సాధారణముగా జీలుగుతోగాని కఱ్ఱతోగాని చేయుదురు. దీనిమధ్యగా ఒకపొడుగుపాటి కట్టె అమర్చబడి ఉండును. ఈ కట్టెకు క్రింది కొనను సీసము బరువు కట్టుదురు. మీదికొనకు ఒక బావుటాయును చిన్నగంటయును కట్టుదురు. పగటివేళ బావుటాచూచియు, రాత్రివేళ గంటచప్పుడు వినియు ఓడలోనివారు నీటిలోనివాడు ఉన్నస్థలమును పోల్చుకొందురు. ఈ చుట్టమీద వాడు కూర్చున్నను మునిగిపోకుండ ఉండునట్టు తేలికగానే దీనిని కట్టుదురు.