పుట:Andhra bhasha charitramu part 1.pdf/696

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నటు కదలిపోక నిలువుగా ఉండును. దీనికి సుమారు 120 ఫాదములు పొడవుగల దారము కట్టబడి ఉండును. దీనికే లాగ్‌దార మందురు. ఈ దారముమీద 'నాట్లు' అనే భాగములు గుర్తింపబడి ఉండును. ఈ దారము ఒక చక్రమునకు చుట్టిఉంచి, ఉపయోగించవలసి వచ్చినప్పుడు ఆ చక్రము మీదనుండి సులువుగా జారవిడుతురు.

టోకు - Cap - బలమైనట్టియు, దళసరియైనట్టియు ఒకబల్ల. దీనిలో రెండుబెజ్జము లుండును. అందులో ఒకటి చదరముగాను, రెండవది గుండ్రముగాను ఉండును. దీనితో రెండు కొయ్యలను కలిపి ఉంఛుటకు వీలవును.

డమానులు - Laniards - చాపల క్రింది కొసలను బిగువుగా లాగి ఉంచు డమానుతాళ్లు. = a sail. డమాను మాసము = The sailing season.

డమాన్ వెళ్లుట - To make lee - way - చాప లెటువైపు గాలితో నిండిఉన్నవో ఆ వైపు నావ నడచుట - చూ. గోన్ వెళ్లుట.

డావు - The right side - కుడిప్రక్క, - "డావు బోడిద" = ఓడకు కుడిప్రక్క, - "గాయి డావుతీరు" = గాయికి కుడివైపు ఉన్నతీరు.

డావు బోడిద - Starboard - అనిమివైపు మొగము త్రిప్పిఉంచగా కుడివైపుఉన్న ఓడప్రక్క.

తక్కువ పదును - Neap-tide - సముద్రము తక్కువగా పొంగిఉండడము. చంద్రుడు రెండు, మూడు పావులలో ఉన్నప్పుడు నీటికి కలుగు పదును లేక పొంగు. చూ. హెచ్చుపదును = Spring tide.

తట్టు - Deck of a ship - నావయొక్క పైభాగము. తట్టువడు = To go aground.

తండా - Aboard or inboard, Hold - ఓడలోపలి ప్రదేశము తండుకోల = An oar = తెడ్డు.

తండేలు - Boatswain - నావమీద రింగినీ, చుక్కాణి, లంగరు, మొదలగు వానిమీద అధికారి. అట్టివారు సాధారణముగా ముగ్గు రుందురు. పెద్దతండేలు, చిన్న తండేలు, కేటు తండేలు అని వారిపేళ్లు.

తయార్! - Ready about! - ఓడ కళానులందరును ఏదైనా ఒకపనిచేయుటకు సిద్ధముగా ఉండుమని ఆజ్ఞ. చూ. తయార్ జాగా!

తయార్ - We are ready - తండేలు 'తయార్‌!' అని ఆజ్ఞ యిచ్చినప్పుడు కళానులు 'తయార్‌' అందురు. అనగా సిద్ధముగా ఉన్నామన్నమాట.