పుట:Andhra bhasha charitramu part 1.pdf/689

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంకారించుట - To roll up a sail, to furl - తెరచాపను పైకి చుట్టి అది వ్రేలబడియున్న కఱ్ఱకు త్రాటితో కట్టి యుంచుట. చూ. ఆర్యా చేయుట, అబేస్‌చేయుట.

అకరాబు - రెండు ముఖ్యదిశలకు సరిగా మధ్యనుండు దిక్కు.

అంజాంత్రాళ్లు - Jeers, halliards, downhauls, చాపలను, పరమానులను మీదికి లేవనెత్తుటకును, దించుటకును ఉపయోగించు త్రాళ్లు.

అజ్జు - Latitude - నిరక్షరేఖకు మీదుగాగాని, క్రిందుగాగాని, ఎన్ని డిగ్రీలుగా ఉన్నవో అ కొలత - చూ. అర్జు.

అడైగోసి - రెండుకొయ్యలు, పరమానులు, తెరచాపలు, ఉండి, ఒక కొయ్యమీదమాత్రమే గాపుటాపులు గల ఓడ.

అడ్డముగావచ్చు - Athwart hawse - ఒక ఓడ ప్రమాదమువలన మరియొక ఓడ అనిమికి ముందుగా వచ్చి ఉన్నప్పటిస్థితి.

అడ్డుగా - athwart ; across; "We discovered a fleet steering athwart us." ఒక నావ మార్గమునకు అడ్డుగా దూరములో పోవుట.

అత్తువాలు - palm - కేన్వానుగుడ్డ కుట్టినప్పుడు ఉపయోగించు ఒక ఉపకరణము.

అందవుచేయుట - Bonnet: చిన్నగాలులలో చిన్నఓడల తెరచాపల అడుగుభాగమునకు కలిపికుట్టు చిన్నగుడ్డ; అట్టిగుడ్డను కలిపికుట్టుట.

అదరగట్టుట - lying to ; to heave to ; ఎదురుగాలులు వేయుచున్నప్పుడు తెరచాపలను ఒక దానికెదురుగా మరియొకదాని నమర్చి, సాధ్యమయినంతమట్టుకు ఓడ కదలకుండ ఒకేదగ్గర ఉండునట్లు చేయుట.

అదరడము - Shivering - గాలిలో తెరచాప ఇటునటు కొట్టుకొనుట.

అనిమి - The fore part of a ship ; నావకు ముందుభాగము.

అనిమి అమరాలుతెగుట - Run ; నావవెనుక ప్రక్క అనగా అమరమునొద్ద ప్రక్కలురెండును మిక్కిలి సన్నమగుట.

అనిమితట్టు - Poop - అనిమికి దగ్గఱగా నున్నతట్టు (deck) భాగము. చూ. అమరముతట్టు.

అబేసుచేయుట - 1. To sheet home - చాపనుపఱచి క్రిందికఱ్ఱకు సాధ్యమయినంతదగ్గఱగా అంటి ఉండునట్లు లాగిఉంచుట. 2. To hoist -