పుట:Andhra bhasha charitramu part 1.pdf/690

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


2. ఎత్తైనకెరటము - "ఓడ రెండు ఓట్లమీదను సరాసరిగా నిలిచి, పోతున్నది." "అది రెండుఓట్లమధ్య లోతులోనికి దిగినది."

ఓడపొర్లుట - To moor ; రెండు లంగరులువేసి అమారులు బిగించి ఉండగా, ఓడ ఇట్టటు తూగుచు నీటిమీద నిలిచి ఉండుట.

కచ్చం అకరాబు - South-west by the Mariner's compass - నైఋతిదిశ. చూ. సమకా.

కచ్చం అకరాబు జమ్నాకొచ్చాకు - South-west by west - కచ్చం అకరాబుకు అనగా నైఋతిదిశకు ఎడమవైపు 360 డిగ్రీలలో 32-వ వంతు డిగ్రీలు చూపు దిశ. చూ. సమకా.

కచ్చం అకరాబు డాపుకొచ్చాకు - South west by south - కచ్చం అకరాబుకు అనగా నైఋతిదిశకు కుడివైపు 360 డిగ్రీలలో 32-వ వంతు డిగ్రీలు చూపు దిశ. చూ. సమకా.

కప్పులతాళ్లు - Tackle - కప్పీలలోనుండి దూర్చియుంచిన త్రాళ్ల సమూహము.

కమాను - Quadrant or sextant - క్వాడ్రాంటుకును సెక్ట్సాంటుకును సామాన్యవాచకము.

కలిమికొయ్య - The third in order of the masts in a fourmasted ship beginning from the stern mast - నాలుగుకొయ్యల ఓడలో అమరము దగ్గరనుండు కొయ్యనుండి లెక్కపెట్టగా, మూడవ కొయ్య.

కలిమి పరమాను - Bumkin - కలిమికొయ్యతో సంబంధించిన పర మాను, అనగా తెరచాపలుకట్టుటకు ఉపయోగించు అడ్డుదూలము. చూ. సముద్దరిబోము.

  • కళాసులు - ఓడమీద పనిచేయు కూలీలు.

కాకన్ - The direction on the Compass showing 1/64th part of 360 degrees. కంపస్సు లేక సమకామీద 360 డిగ్రీలలో 1/64 భాగమును చూపుదిక్కు.

కాకాకస్ - The direction on the Compass showing 1/128th part of 360 degrees. సమకామీద 360 డిగ్రీలలో 1/128 దో భాగమును చూపుదిక్కు.

' The hole over which the radder stands. చుక్కాణి ఉండుబెజ్జము.