పుట:Andhra bhasha charitramu part 1.pdf/620

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండి యొత్తిడి కలుగకుండ జేయుచుండెను. నేటి యాఫ్‌ఘనిస్థానపు అమీర్ వంటి పదవి నాతాడాకాలమున గలిగియుండెనని తలంపవచ్చును.

ఇట్లే మరుత్తులుకూడ తొలుత నసురులుగా నుండిరి. తరువాత నార్య దేవతావర్గమున సామంతులైనను ముఖ్యస్థానమును వహించిరి. ఆర్యుల యితర శత్రువులలో "అహి" యనునసురు డై రేనియనులలో "అజిదహక్" అనుపేర నున్నాడు. ఇట్లే "వృత్రుడు" ను నొక ఐరేనియను దేవతయే. ఆర్యుల శత్రువులగు "పణు" లను వారే "స్ట్రాబో" (Strabo) యను గ్రీకు వేదాంతి వర్ణించిన పార్మియను (Parmians) లని తలంపబడుచున్నారు. వారొకరీతి సంచారశీలురగు నైరేనియను జాతివారనియు, నేడు "అమూదర్య" (Amu Darya) యని పిలువబడు "ఆక్ససు" (Oxus) నదీ ప్రాంతములం దుండిరనియు నాతడు దెలిపియున్నాడు. పారావతులు లేక పర్వతజాతులవా రార్యులతో బోరాడిరని వేదములందు తెలుపబడిన జాతులవారు స్ట్రాబో యుదాహరించిన "పరోఎత్తై" (Parouetai) అనువారే యని "హిల్లేబ్రాంబు" (Hille Brandt) పండితుని యభిప్రాయము.

ఆర్యుల శత్రువులలో "దస్యు" లనువారు ముఖ్యులై వారిని పలువిధముల భాధించినట్లు వేదమువలన దెలియగలదు. "దస్యు" అను పదము ప్రాచీన పర్షియనుభాషయందును "ఎకమీనియన్" (Achemenian) శాసనములందును 'దహ్యు' అనురూపమున గానవచ్చుచున్నది. అం దాపదమునకు నీచార్థములేదు. దానికి జనులు అని మాత్రమర్థము. కాని వేదమున క్రమక్రమముగ దానికి మొదట శత్రువులనియు, తర్వాత దుష్టపిశాచములనియు నర్థము కలిగినది. దన్యులలో గొందఱు కృష్ణత్వచులు, కొందఱు కారు. బహుశ: భారతవర్షమున తొల్లింటి నివాసులై, ఆర్యాక్రమణము నడ్డగించిన జాతులవా రందఱికి నీపదము వాడబడియుండును. వా రార్యులకు లోబడిన పిదపి వర్ణవిభాగమునందు చతుర్థవర్ణముగ 'శూద్రు' లనుపేర నార్యకుటుంబమున జేరియుందురు. ఎట్లయినను 'ఎడ్వర్డు మేయరు' (Edward Meyer) మొదలగు పండితు లీదన్యులే ఐరేనియను జాతులకు సంబంధించి, 'కాస్పియస్‌' సముద్రమునుండి నేడు 'సిర్‌దర్‌యా' (Syr Darya) యని పిలువబడు 'యక్సార్‌టిస్‌' (Yaxartes) నదివరకు వ్యాపించియున్న, కిర్ఘిజ్-తుర్క్‌మర్ (Kirghira-Turkman) అను పచ్చికబయళ్లలో నివసించుచున్న 'దహయే' (Dahae) అనువారిని తలంచుచున్నారు. దస్యులు యుద్ధమునందు 'హేలయో' అని యార్చుచుండిరట. ఇది 'హేరయో' అనుదానికి వికృతి. రేఫమునకు లకారాదేశము చూలికాపైశాచియందు కలుగునని ప్రాకృత లాక్షిణుకులు తెలిపియున్నారు. ఈ సందర్బమున బ్రాహుయీ జాతివారిని